భర్త మర్మాంగాలు కోసి చంపిన భార్య

Wife Murdered Husband In Maripeda. మరిపెడ మండలం తానంచెర్ల రెవెన్యూ పరిధి వాంకుడొతు తండాలో జరిగింది. వివరాల్లోకి వెళ్లితే

By Medi Samrat  Published on  22 Sept 2021 11:25 AM IST
భర్త మర్మాంగాలు కోసి చంపిన భార్య

మరిపెడ మండలం తానంచెర్ల రెవెన్యూ పరిధి వాంకుడొతు తండాలో దారుణం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. వాంకుడొతు తండాకు చెందిన భూక్యా బీచ్యా.. భార్య ప్రమీలను నిత్యం తాగి వేదిస్తున్నాడు. మంగళవారం రాత్రి కూడా తాగి భార్య‌తో గొడ‌వ‌కు దిగాడు. దీంతో విఛ‌క్ష‌ణ కోల్పోయిన భార్య ప్ర‌మీల‌.. తాగి ఉన్న భర్త మర్మాంగాలు కోసి చంపింది. ఘ‌ట‌న‌పై స‌మాచారం అందుకున్న‌ మరిపెడ సీఐ సాగర్, ఎస్సై పిట్ల ప్రవీణ్ ఘటనాస్థలికి చేరుకుని ప‌రిశీలించారు. మృతుడి భార్య ప్రమీల, కుమారుడు పోలీసుల‌ అదుపులో ఉన్నట్లు తెలుస్తుంది. మృతుడికి కుమార్తె కూడా ఉంది. ఘ‌ట‌న‌పై పూర్తి వివ‌రాలు తెలియాల్సివుంది.


Next Story