కర్నూలు జిల్లా ఉయ్యాలవాడలో ఓ భార్య చేసిన దారుణం

Wife Murdered Husband in Kurnool. కర్నూలు జిల్లా ఉయ్యాలవాడలో భార్య భర్తను వదిలించుకోడానికి ఘోరానికి పాల్పడింది.

By Medi Samrat  Published on  18 Oct 2021 2:00 PM GMT
కర్నూలు జిల్లా ఉయ్యాలవాడలో ఓ భార్య చేసిన దారుణం

కర్నూలు జిల్లా ఉయ్యాలవాడలో భార్య భర్తను వదిలించుకోడానికి ఘోరానికి పాల్పడింది. తన అఫైర్ కు భర్త అడ్డుగా ఉన్నాడని భావించి.. అతడిని అడ్డు తొలగించుకోవాలని ప్రియుడితో కలిసి ప్లాన్ వేసింది. సాధారణ హత్యగా చిత్రీకరించాలని ప్రణాళికలు రచించినా కూడా అవి బెడిసికొట్టాయి. ప్రియుడితో కలిసి భర్తను అడ్డు తొలగించుకోవాలని చేసిన ప్రయత్నం చివరికి ఆమెను, ఆమె ప్రియుడిని కటకటాల పాలుచేసింది. ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన రామయ్య పండ్ల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతని భార్య జయలక్ష్మీ అదే గ్రామానికి చెందిన మహ్మద్‌ కైజర్‌తో రెండేళ్లుగా వివాహేతర సంబంధం నడుపుతోంది. విషయం తెలిసిన రామయ్య భార్యను గతంలో మందలించాడు.

దీంతో భర్తను అడ్డు తొలగించాలనుకున్న జయలక్ష్మీ ప్రియుడు కైజర్‌తో కలిసి భర్త హత్యకు పథకం రచించింది. సెప్టెంబర్‌ 13న రామయ్య గొంతుకు టవల్‌ బిగించి హతమార్చి మృతదేహాన్ని హంద్రీనీవా కాలువలోపడేశారు. ఎక్కడికో వెళ్లిపోయాడని కుటుంబ సభ్యులు భావించారు. అయితే జయలక్ష్మీ పై అనుమానాలు మాత్రం కుటుంబ సభ్యుల్లో అలాగే ఉన్నాయి. అనంతరం తండ్రి మరణంపై కూతురు చందన, కుమారుడు శేఖర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు రామయ్య హత్య మిస్టరీని చేధించారు. విచారణలో తాము చేసిన దారుణాన్ని వాళ్ళు ఒప్పుకున్నారు. నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.


Next Story