దారుణం.. భర్తను కత్తితో నరికి.. తలతో పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన భార్య
Wife murdered her husband in Chittoor's renigunta. చిత్తూరు జిల్లా పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ భార్య తన భర్తను అతి క్రూరంగా హత్య చేసింది.
By అంజి Published on
20 Jan 2022 8:38 AM GMT

చిత్తూరు జిల్లా పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ భార్య తన భర్తను అతి క్రూరంగా హత్య చేసింది. కత్తితో దారుణంగా భర్త తల నరికేసింది. ఈ ఘటన రేణిగుంటలో జరిగింది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. రవిచంద్రన్ (53), వసుంధరలు భార్యాభర్తలు. వీరు పోలీసులైను కాలనీలో నివాసం ఉంటున్నారు. వీరికి 20 ఏళ్ల కొడుకు ఉన్నాడు. ఇవాళ ఉదయం భార్యభర్తల మధ్య చిన్నపాటి గొడవ జరగగా.. అది చిలికి చిలికి పెద్దదిగా మారింది. దీంతో భార్య వసుంధర తీవ్ర ఆగ్రహానికి గురైంది. కోపంతో కత్తి తీసుకుని భర్తపై దాడి చేసింది.
భర్త తలను అతికిరాతకంగా నరికింది. ఆ తర్వాత భర్త తలను ఓ సంచిలో పట్టుకుని స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. తన భర్తను హత్య చేశానని పోలీసుల ఎదుట లొంగిపోయింది. భార్య వసుంధర పోలీస్‌స్టేషన్ తీసుకువచ్చిన సంచిని పరిశీలించారు. దాంట్లో భర్త తల కనబడడటంతో ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. ఆ తర్వాత నిందితురాలిని తీసుకుని ఘటనా స్థలికి వెళ్లారు. క్రైమ్ జరిగిన తీరు పరిశీలించి.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Next Story