Guntur : ప్రియుడితో కలిసి భర్తను చంపింది.. ఆపై రాత్రంతా పోర్న్ వీడియోలు చూస్తూ..
గుంటూరు జిల్లాలో ప్రియుడితో కలిసి భార్య భర్తను చంపేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది.
By - Medi Samrat |
గుంటూరు జిల్లాలో ప్రియుడితో కలిసి భార్య భర్తను చంపేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. అంతేకాదు నిందితురాలు రాత్రంతో ఒంటరిగా కూర్చుని పోర్న్ వీడియోలు చూస్తూ గడిపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దుగ్గిరాల మండలం చిలువూరుకు చెందిన లోకం శివనాగరాజు ఉల్లిపాయల వ్యాపారి. శివనాగరాజుకు లక్ష్మీమాధురితో 2007లో వివాహం అయ్యింది. వీరికి ఇద్దరు మగపిల్లలు. అయితే.. లక్ష్మీమాధురి గతంలో విజయవాడలో సినిమాహాల్ టికెట్ కౌంటర్‌లో పనిచేసేది. అక్కడ సత్తెనపల్లికి చెందిన గోపి అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. లక్ష్మీమాధురికి భర్త చేసే ఉల్లిపాయల వ్యాపారం నచ్చలేదు. దానిని అవమానంగా భావించింది. భర్తతో మాట్లాడి ఆ వ్యాపారాన్ని కూడా మాన్పించి హైదరాబాద్‌లో కారు ట్రావెల్స్ నిర్వహిస్తున్న ప్రియుడు గోపి వద్దకు ఉద్యోగం కోసం పంపింది. అక్కడ నిలదొక్కుకోలేక కొన్నాళ్ల తర్వాత శివనాగరాజు చిలువూరు వచ్చేశాడు. అప్పటి నుంచి భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో భర్త ఇంటి దగ్గరే వ్యాపారం చేస్తుండటంతో.. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించి ప్రియుడితో కలిసి హత్య చేయాలని ప్లాన్ చేసింది.
ఈ క్రమంలోనే జనవరి 18న రాత్రి భర్త కోసం లక్ష్మీమాధురి బిర్యానీ చేసింది. ఆ బిర్యానీలో 20 నిద్రమాత్రలు కలిపింది. బిర్యానీ తిన్న నాగరాజు గాడ నిద్రలోకి జారుకున్నాక.. రాత్రి 11.30 గంటలకు ప్రియుడు గోపి లక్ష్మీమాధురి ఇంటికి చేరుకున్నాడు. ఆపై మత్తులో ఉన్న నాగరాజు ఛాతీపై గోపి కూర్చోగా.. లక్ష్మీమాధురి దిండుతో ముక్కుపై ఒత్తి పట్టి భర్తకు ఊపిరాడకుండా చేసింది. నాగరాజు చనిపోయాడని నిర్ధారించుకున్నాక గోపి వెళ్లిపోయాడు. ఆ తర్వాత మాధురి రాత్రంతా పోర్న్ వీడియోలు చూస్తూ గడిపింది. తెల్లవారుజామున చుట్టుపక్కల వారిని పిలిచి భర్త గుండెనొప్పితో చనిపోయాడని డ్రామా మొదలుపెట్టింది. ఆపై మృతదేహాన్ని అంత్యక్రియలకు తరలించే ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో చెవి దగ్గర గాయం, రక్తం కారుతుండటాన్ని నాగరాజు స్నేహితులు గమనించారు. వెంటనే వారు నాగరాజు తండ్రితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. పోస్టుమార్టం నివేదికలో నాగరాజు ఛాతీ దగ్గర ఎముకలు విరిగిపోయాయని, ఊపిరాడకుండా చేయడంతోనే అతడు మరణించాడని తేలింది. వెంటనే పోలీసులు మాధురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. అసలు నిజం బయటపడింది.