భర్త చనిపోవడంతో మనస్తాపానికి గురైన భార్య మృతి

Wife dies in grief following the death of husband in Srikakulam. భర్త మరణాన్ని తట్టుకోలేని భార్య 24 గంటల్లోనే కన్నుమూసిన విషాద ఘటన

By Medi Samrat
Published on : 30 Aug 2022 7:40 PM IST

భర్త చనిపోవడంతో మనస్తాపానికి గురైన భార్య మృతి

భర్త మరణాన్ని తట్టుకోలేని భార్య 24 గంటల్లోనే కన్నుమూసిన విషాద ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది. భర్త సిరిమామిడి పంచాయతీ తోటూరుకు చెందిన సుందరరావు ఉపాధి నిమిత్తం భార్యతో కలిసి బిలాయిలో ఉంటున్నాడు. సుందర్‌రావు అనారోగ్యంతో ఆదివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. భర్త మృతి చెందాడన్న బాధతో భార్య పుణ్యవతి కూడా సోమవారం మధ్యాహ్నం మృతి చెందింది. భార్యాభర్తల మృతితో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు.

సుందరరావు పెద్ద కుమారుడికి వివాహం కాగా, ఈ నెల 20న తమ చిన్న కుమారుడి వివాహం చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ అనివార్య కారణాల వల్ల పెళ్లి వాయిదా పడింది. ఇంతలో సుందర్ రావు మృతి ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. సుందర్ రావు ఇందిరాగాంధీ విద్యాలయంలో తెలుగు ఉపాధ్యాయునిగా విధులు నిర్వ‌ర్తించేవాడు.

Next Story