ప్రియుడితో కలిసి పట్టుబడ్డ భార్య.. భర్త కోపంతో ఏం చేశాడంటే.!

Wife caught with her boyfriend, angry husband did this. మధ్యప్రదేశ్‌ రాష్ట్రం రాజ్‌గఢ్ జిల్లాలోని సుథాలియా పోలీస్ స్టేషన్ పరిధిలో వివాహేతర సంబంధానికి సంబంధించిన సంఘటన

By అంజి  Published on  27 Feb 2022 7:22 AM GMT
ప్రియుడితో కలిసి పట్టుబడ్డ భార్య..  భర్త కోపంతో ఏం చేశాడంటే.!

మధ్యప్రదేశ్‌ రాష్ట్రం రాజ్‌గఢ్ జిల్లాలోని సుథాలియా పోలీస్ స్టేషన్ పరిధిలో వివాహేతర సంబంధానికి సంబంధించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి తన భార్యను ఆమె ప్రియుడిని ఏకాంతంగా ఉన్నప్పుడు చూసి ఇద్దరినీ చెట్టుకు కట్టేశాడు. ఈ హై-వోల్టేజ్ డ్రామాను చూడటానికి అనేక మంది వ్యక్తులు గుమిగూడారు. అక్కడే ఉన్న ఒకరు ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. సుథాలియా పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఖానోటా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అక్కడ ఓ వ్యక్తి తన భార్యను, ఆమె ప్రియుడిని చెట్టుకు కట్టివేసాడు. చాలా సేపు వాగ్వాదం జరిగింది. కేసు నమోదైన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరిని తమతో పాటు పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారని, ఈ కేసు అనంతరం భార్యాభర్తలకు కౌన్సిలింగ్‌ ఇచ్చారు. అనంతరం వారిద్దరూ ఇంటికి వెళ్లిపోయారు.

ప్రియురాలిని కలిసేందుకు ప్రియుడు ఆమె గ్రామానికి వచ్చాడని ప్రజలు చెబుతున్నారు. మహిళ భర్త ఇద్దరు కలిసి ఉన్న పట్టుకున్నాడు. ఆపై భర్త వారిద్దరినీ పట్టుకుని అడవికి తీసుకెళ్లాడు. అక్కడ వారిద్దరినీ చెట్టుకు కట్టేసి కొట్టాడు. ప్రేమికుడు నారీ గ్రామ నివాసి అని, మహిళ ఖనోటా గ్రామానికి చెందినదని స్థానికులు చెప్పారు. ఖానోటా గ్రామంలోని పొలంలో స్త్రీ, పురుషులను బందీలుగా ఉంచడంపై ఫిర్యాదు అందిందని ఎస్‌హెచ్‌ఓ రామ్‌కుమార్ రఘువంశీ తెలిపారు. అక్కడికి చేరుకున్న పోలీసు బృందం.. ఓ మహిళను, ఓ వ్యక్తిని చెట్టుకు తాడుతో కట్టివేయడం గమనించారు. తర్వాత వారిద్దరినీ పోలీస్ స్టేషన్‌కి తీసుకొచ్చాం అని తెలిపారు.

Next Story
Share it