భర్తను బ్యాట్ తో చితక్కొట్టిన భార్య.. వీడియో వైరల్ అవ్వడంతో..!

Wife beats husband, man moves court with CCTV recording in Alwaరాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాకు చెందిన ఓ పాఠశాల ప్రిన్సిపాల్ తన భార్య r.

By Medi Samrat  Published on  25 May 2022 5:15 PM IST
భర్తను బ్యాట్ తో చితక్కొట్టిన భార్య.. వీడియో వైరల్ అవ్వడంతో..!

రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాకు చెందిన ఓ పాఠశాల ప్రిన్సిపాల్ తన భార్య పెట్టే శారీరక, మానసిక వేధింపుల నుంచి రక్షణ కోరుతూ కోర్టును ఆశ్రయించాడు. అతని భార్య తనను ఇష్టం వచ్చినట్లు కొడుతూ ఉందని అతడు ఫిర్యాదులో చెప్పుకొచ్చాడు. తన భార్య పాన్, కర్ర, క్రికెట్ బ్యాట్‌.. ఇలా ఏది దొరికితే దానితో తనపై దాడి చేస్తుందని అతడు పోలీసు ఫిర్యాదులో పేర్కొన్నాడు. సాక్ష్యాలను సేకరించేందుకు ఇంట్లో సీసీటీవీ కెమెరాలను కూడా అమర్చాడు. సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న వీడియోలలో ఒకదానిలో, ఆ మహిళ ప్రిన్సిపాల్‌ని క్రికెట్ బ్యాట్‌తో కొడుతుండగా, వారి కొడుకు చూస్తూ ఉన్నాడు.

హర్యానాలోని సోనిపట్‌లో నివాసం ఉంటున్న సుమన్‌తో ఏడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు అజిత్‌సింగ్‌ యాదవ్‌. మొదట్లో వీరి జీవితం ప్రశాంతంగా సాగినా కొంత కాలం తర్వాత హింస మొదలైంది. అజిత్ సింగ్ అనేకసార్లు గాయాలపాలయ్యాడు.. ట్రీట్మెంట్ తీసుకుంటూ వచ్చాడు. ఉపాధ్యాయ వృత్తి గౌరవాన్ని దృష్టిలో ఉంచుకుని హింసను సహిస్తున్నట్లు సింగ్ తెలిపాడు. అయితే నా భార్య అన్ని హద్దులు దాటినందున నేను కోర్టును ఆశ్రయించానని చెప్పాడు. రక్షణ కోసం కోర్టును ఆశ్రయించిన ఆయన ఘటనకు సంబంధించిన ఫుటేజీని సమర్పించారు. ఆయనకు భద్రత కల్పించాలని కోర్టు ఆదేశించింది.










Next Story