మహిళపై ఇనుప రాడ్‌తో దంప‌తుల దాడి.. ప్రాణం విడుస్తున్న‌ సమయంలో లైంగిక సుఖాన్ని పొందారట..!

Wife And Husband killed the woman. అమెరికాలో ఓ మహిళ, ఓ వ్యక్తి కలిసి.. ఇంకో మహిళను ఇనుప రాడ్‌తో బాది

By M.S.R
Published on : 11 Jan 2022 9:03 AM

మహిళపై ఇనుప రాడ్‌తో దంప‌తుల దాడి.. ప్రాణం విడుస్తున్న‌ సమయంలో లైంగిక సుఖాన్ని పొందారట..!

అమెరికాలో ఓ మహిళ, ఓ వ్యక్తి కలిసి.. ఇంకో మహిళను ఇనుప రాడ్‌తో బాది హతమార్చారు. ఆ మహిళ తుది శ్వాస విడిచే సమయంలో నేరానికి పాల్పడ్డ ఇద్దరూ కలిసి.. ఆమె శరీరంతో లైంగిక సుఖాన్ని పొందారట..! చనిపోయిన మహిళతో హంతకురాలితో స్వలింగ సంపర్కం వ్యవహారం కూడా ఉండేదని తెరపైకి వచ్చింది. ఈ ఘటన జరిగిన తర్వాత మృతురాలి ఇంటి నుంచి కారుతో సహా పలు వస్తువులను ఆ దంపతులు అపహరించారు. ఈ ఘటన అమెరికాలోని ఓక్లహోమాలోని తుల్సాలో చోటుచేసుకుంది. జనవరి 4న మహిళ హత్యకు గురైంది.

అందిన సమాచారం ప్రకారం.. మరణించిన మహిళ వయస్సు 29 సంవత్సరాలు. ఈ కేసు విచార‌ణ‌లో అనేక విస్మ‌య‌కరమైన విష‌యాలు బయటకు వచ్చాయి. పోలీసులు ఆ జంట‌ను విచారించే కొద్దీ షాక్ అవుతూనే ఉన్నారు. దంపతులైన 28 ఏళ్ల నికోలస్ జాన్సన్, 25 ఏళ్ల బ్రిన్లీ డెన్నిసన్‌లను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల ముందు విచారణలో.. నికోలస్, డెన్నిసన్‌తో సంబంధం ఉందని చెప్పాడు. కానీ డెన్నిసన్ మరణించిన మహిళతో స్వలింగ సంపర్కం కూడా కలిగి ఉందని ఒప్పుకొంది.

నికోలస్.. మహిళలు ఇద్దరి మధ్య సంబంధాన్ని ఇష్టపడలేదు. ఇదే ఆమె హత్యకు కారణమైంది. తన భార్యతో సంబంధం కలిగి ఉందని ఆ మహిళను హత్య చేశాడు.. ఆ తర్వాత అందుకు అతడి పార్ట్నర్ కూడా సహకరించింది. ఇద్దరు నేరస్థులను వాషింగ్టన్ కౌంటీ జైలుకు తరలించారు. ఈ కేసులో దొంగిలించబడిన కారును అర్కాన్సాస్‌లోని ఫాయెట్‌విల్లే నుండి స్వాధీనం చేసుకున్నారు. ఈ కారులో నేరం చేసిన దంపతులు ఇద్ద‌రు నిద్రిస్తున్నారు. పోలీసులు వారిని విచారించగా తమ నేరాన్ని అంగీకరించారు.


Next Story