పెళ్లి పేరుతో వితంతువుని మోసం చేసిన యువ‌కుడు.. తాళ్లతో కట్టేసి.. స్నేహితులతో కలిసి అత్యాచారం

widow woman cheated by imposter in chattisgarh. బిలాస్‌పూర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. మహిళను తాళ్లతో కట్టేసి చిత్ర హింసలకు గురి చేసి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు.

By అంజి  Published on  13 Dec 2021 9:56 AM GMT
పెళ్లి పేరుతో వితంతువుని మోసం చేసిన యువ‌కుడు.. తాళ్లతో కట్టేసి.. స్నేహితులతో కలిసి అత్యాచారం

బిలాస్‌పూర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. మహిళను తాళ్లతో కట్టేసి చిత్ర హింసలకు గురి చేసి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. మహిళా గట్టిగా అరవడంతో పక్కింట్లోని ఒకరు అక్కడి వచ్చి చూశారు. ఇంటికి తాళం వేసి ఉండటంతో పోలీసులకు సమాచారం అందించారు. తాళం పగలగొట్టి లోపలికి వెళ్లి చూసే సరికి.. మహిళ నగ్న స్థితిలో తాళ్లతో కట్టేసి ఉంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రానికి చెందిన ఓ మహిళ (40) భర్త గత నాలుగేళ్ల కిందట చనిపోయాడు. అదే సమయంలో ఆ మహిళకు దినేష్‌ రాణా అనే యువకుడితో పరిచయం ఏర్పడి.. అది స్నేహంగా మారింది.

ఓ రోజు ఇంట్లో మహిళా స్నానం చేస్తుండగా.. దినేష్‌ ఆమె వీడియోను తీశాడు. అప్పటి నుండి మహిళను ఆ వీడియో చూపిస్తూ బ్లాక్‌ మెయిల్‌ చేస్తూ వచ్చాడు. అవసరమైనప్పుడల్లా ఆమె దగ్గర డబ్బులు తీసుకున్నాడు. ఓ రోజు ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. అతడి మాటలు నమ్మిన మహిళ పెళ్లి అంగీకరించింది. 2020లో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కొన్ని రోజులకు ఉద్యోగం పేరిట దినేష్‌ బిలాస్‌పూర్‌ వెళ్లాడు. మహిళను కూడా అక్కడికి రావాలని చెప్పాడు. అయితే బిలాస్‌పూర్‌ వెళ్లిన మహిళకు షాకింగ్‌ విషయం ఒకటి తెలిసింది. దినేష్‌ అసలు దానిష్‌ ఇనామ్‌ అని, అతడు ఒక ముస్లిం. అతడికి ఇంతకుముందే పెళ్లి అయ్యింది.

దినేష్‌ అలియాస్‌ దానిష్‌ అప్పటికే మహిళ దగ్గరి నుండి రూ.8 లక్షలకుపైగా డబ్బు గుంజాడు. దీంతో తాను మోసపోయానంటూ బాధితురాలి పోలీసులను ఆశ్రయించింది. ఈ విషయం తెలుసుకున్న దానిష్‌.. మహిళపై కోపంతో రగిలిపోయాడు. మహిళ ఇంటికి దానిష్‌ తన స్నేహితులను తీసుకువెళ్లాడు. ఆ తర్వాత దానిష్‌, అతడి స్నేహితుడు మహిళను చిత్ర హింసలు పెట్టి, అత్యాచారం చేశారు. కేసు వెనక్కి తీసుకోవాలని బెదిరించి.. మహిళను తాళ్లతో కట్టి అక్కడి నుండి వెళ్లిపోయారు. మహిళ అరుపులు విన్న పక్కింటి వాళ్లు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో మహిళను రక్షించిన పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ఆమెపై అత్యాచారం జరిగిందని పరీక్షల్లో తేలడంతో నిందితులపై కేసు నమోదు చేశారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Next Story
Share it