వితంతువు దారుణ హ‌త్య‌

Widow murdered by unknown persons in Karimnagar. క‌రీంన‌గ‌ర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలో గురువారం అర్ధరాత్రి గుజ్జుల సులోచన

By Medi Samrat  Published on  7 Oct 2022 11:45 AM IST
వితంతువు దారుణ హ‌త్య‌

క‌రీంన‌గ‌ర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలో గురువారం అర్ధరాత్రి గుజ్జుల సులోచన (45) అనే వితంతువును గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. హ‌త్య‌కు అస‌లు కారణం ఇంకా తెలియనప్పటికీ.. భూ వివాదమే హత్యకు కారణమని అంటున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సులోచన కొంతకాలం క్రితం భర్త చనిపోవడంతో తల్లి బాలవ్వ వద్ద ఉంటోంది. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంట్లో నిద్రిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు తలుపు తట్టారు.

తలుపు తీయగానే సులోచనపై కత్తులతో దాడి చేశారు. కూతురిని రక్షించేందుకు ప్రయత్నించిన బాలవ్వపై కూడా దాడి చేశారు. సులోచన అక్కడికక్కడే మృతి చెందగా, బాలవ్వకు తీవ్ర గాయాలయ్యాయి. ఇరుగుపొరుగు వారు బాలవ్వను జిల్లా కేంద్రాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కరీంనగర్ రూరల్ ఏసీపీ కరుణాకర్ రావు, సీఐ శేషిధర్ రెడ్డి సంఘటనా స్థలాన్ని సందర్శించి ఘటనపై ఆరా తీశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.


Next Story