వాట్సాప్‌లో 'తలాక్‌' చెప్పిన భర్త.. భార్య ఆత్మహత్య.!

whatsapp triple talaq news. కర్ణాటక రాష్ట్రం కొడగు జిల్లా కుంజిల గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. వాట్సాప్‌లో 'తలాక్‌' అంటూ భర్త

By అంజి  Published on  17 Oct 2021 3:02 AM GMT
వాట్సాప్‌లో తలాక్‌ చెప్పిన భర్త.. భార్య ఆత్మహత్య.!

కర్ణాటక రాష్ట్రం కొడగు జిల్లా కుంజిల గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. వాట్సాప్‌లో 'తలాక్‌' అంటూ భర్త మూడుసార్లు మేసెజ్‌ చేయడంతో భార్య ఆత్మహత్యకి పాల్పడింది. భర్త రుబైస్‌ నుంచి 'తలాక్‌' అంటూ భార్య అమీరాకు ఈ నెల 4వ తేదీన మేసెజ్ వచ్చింది. దీంతో జీవితంపై విరక్తి చెందిన అమీరా ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. భర్త, అత్త, మామలపై కేసు నమోదు చేసిన పోలీసులు.. అదనంగా కానుకలు తీసుకురాకపోవడంతోనే తలాక్‌ చెప్పినట్లు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉంటే జమాయిత్‌ మండలి ముగ్గురు నిందితులను బహిష్కరించింది.

Next Story
Share it