వ‌రంగ‌ల్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ దంప‌తులు రోడ్డు ప్ర‌మాదంలో మృతి

Warangal Software Engineer Couple dead in a road accident.కారు అదుపు త‌ప్పి డివైడ‌ర్‌ను ఢీ కొట్టింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 Nov 2022 6:10 AM GMT
వ‌రంగ‌ల్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ దంప‌తులు రోడ్డు ప్ర‌మాదంలో మృతి

కారు అదుపు త‌ప్పి డివైడ‌ర్‌ను ఢీ కొట్టింది. ఈ ప్ర‌మాదంలో ముగ్గురు దుర్మ‌ర‌ణం చెందారు. ఈ ఘ‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని శ్రీస‌త్య‌సాయి జిల్లా క‌న‌గాన‌ప‌ల్లె మండ‌లం ప‌ర్వ‌త‌దేవ‌ర‌ప‌ల్లిలో చోటు చేసుకుంది.

తెలంగాణ రాష్ట్రంలోని వ‌రంగ‌ల్ జిల్లాకు చెందిన‌ గోపినాథ్‌, ర‌మ్య దంప‌తులు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా ప‌ని చేస్తున్నారు. వారి పిల్ల‌లు సాహిత్‌, హాసిని ల‌తో పాటు బంధువు తారకేశ్వ‌రి(62)తో క‌లిసి కారులో బెంగ‌ళూరు నుంచి హైద‌రాబాద్‌కు వ‌స్తున్నారు. వీరు ప్ర‌యాణిస్తున్న కారు ప‌ర్వ‌త‌దేవ‌ర‌ప‌ల్లి వ‌ద్ద అదుపు త‌ప్పి డివైడ‌ర్‌ను ఢీ కొట్టింది. ఘ‌ట‌నాస్థ‌లంలోనే ర‌మ్య‌, గోపినాథ్ దంప‌తులు మ‌ర‌ణించారు.

స‌మాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయ‌ప‌డిన తార‌కేశ్వ‌రితో పాటు చిన్నారులు ఇద్ద‌రిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అయితే.. మార్గ‌మ‌ధ్యంలోనే తార‌కేశ్వ‌రి మృతి చెందింది. దీంతో ఈ ప్ర‌మాదంలో మృతి చెందిన వారి సంఖ్య మూడుకు చేరింది. చిన్నారులు ఇద్ద‌రికి చికిత్స అందిస్తున్నారు.

కాగా.. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Next Story