విశాఖలో మైనర్ కుమార్తెపై తండ్రి అత్యాచారం.. ఫోన్‌లో ఎక్కువ సమయం గడుపుతోందని..

Vizag man held for raping his minor daughter. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని విశాఖపట్నంలో దారుణ ఘటన వెలుగు చూసింది. 42 ఏళ్ల తండ్రి తన 15 ఏళ్ల కుమార్తెపై పదేపదే అత్యాచారానికి పాల్పడ్డాడు.

By అంజి  Published on  25 Jan 2022 12:10 PM IST
విశాఖలో మైనర్ కుమార్తెపై తండ్రి అత్యాచారం.. ఫోన్‌లో ఎక్కువ సమయం గడుపుతోందని..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని విశాఖపట్నంలో దారుణ ఘటన వెలుగు చూసింది. 42 ఏళ్ల తండ్రి తన 15 ఏళ్ల కుమార్తెపై పదేపదే అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడిని జనవరి 23, ఆదివారం జ్యుడిషియల్ రిమాండ్‌కు తరలించారు పోలీసులు. యువతి ఫోన్‌లో ఎక్కువ సమయం గడుపుతోందన్న కోపంతో తండ్రి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ బాధను తట్టుకోలేక ఆ బాలిక ఇటీవల తన టీచర్‌కి జరిగిన లైంగిక వేధింపుల గురించి చెప్పింది. ఉపాధ్యాయురాలు తన తండ్రిని పాఠశాలకు పిలిపించి మందలించగా నిందితుడు క్షమాపణలు చెప్పాడు. అయితే టీచర్‌, బాలిక శనివారం సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు బాలికను పరీక్షలకు తరలించారు.

నిందితుడికి కిడ్నీలు విఫలమై రెండేళ్ల క్రితం అస్వస్థతకు గురైనట్లు విచారణలో పోలీసులు గుర్తించారు. అతని భార్య అతనికి కిడ్నీ దానం చేసింది. ఐదు నెలల క్రితం భార్య అనారోగ్యంతో.. తన తల్లి ఇంట్లో చికిత్స పొందుతోంది. కూతురు తండ్రిని చూసుకునేది. అయితే ఆమె మొబైల్ ఫోన్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నదని నిందితుడు చెప్పాడు. కోపంతో గత కొన్ని నెలలుగా ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. మరో ఘటనలో 5 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడన్న ఆరోపణలతో 12 ఏళ్ల బాలుడిని వైజాగ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలిక ఆడుకుంటున్న సమయంలో బాలుడు ఆమెను తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.

Next Story