భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోడు భూముల వివాదం ఓ అధికారి ప్రాణాల మీదికి తెచ్చింది. అటవీ భూములు కాపాడేందుకు ప్రయత్నించిన అధికారి విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయాడు. వివరాళ్లోకెళితే.. చంద్రుగొండ మండలం బెండలపాడు గ్రామం ఎర్రబొడులో ప్లాంటేషన్ మొక్కలను నరుకుతుండగా అడ్డుకున్న ఫారెస్ట్ రేంజర్ అధికారి శ్రీనివాసరావుపై పోడు భూముల సాగుదారులు వేట కొడవళ్లతో దాడి చేశారు. దీంతో శ్రీనివాసరావు మెడపై తీవ్రగాయాలవడంతో చంద్రుగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో శ్రీనివాసరావును ఖమ్మం కిమ్స్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో తుదిశ్వాస విడిచారు.