విజయవాడ నడిరోడ్డుపై సరస్వతి దారుణ హత్య

విజయవాడ నగరంలో నడిరోడ్డుపై భార్యని భర్త కిరాతకంగా పొడిచి చంపాడు

By -  Medi Samrat
Published on : 13 Nov 2025 5:28 PM IST

విజయవాడ నడిరోడ్డుపై సరస్వతి దారుణ హత్య

విజయవాడ నగరంలో నడిరోడ్డుపై భార్యని భర్త కిరాతకంగా పొడిచి చంపాడు. మెడపై పొడిచి పీక కోయడంతో ఆ మహిళ తీవ్రమైన రక్తస్రావంతో కుప్పకూలింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సరస్వతి మృతి చెందింది.

విజయవాడ విన్స్ హాస్పిటల్‌లో సరస్వతి నర్సుగా పనిచేస్తోంది. గత కొన్ని నెలలుగా కుటుంబ కలహాల నేపథ్యంలో తరచూ భార్యాభర్తల గొడవలు జరుగుతున్నాయి. సరస్వతిపై తీవ్ర కోపం పెంచుకుకున్న భర్త విజయ్‌, భార్యను నడిరోడ్డుపై అత్యంత కిరాతకంగా పొడిచాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 2022 ఫిబ్రవరి 14న విజయ్‌, సర్వసతీ ప్రేమ వివాహం చేసుకున్నారు. సరస్వతి వీన్స్ ఆసుపత్రిలో స్టాఫ్ నర్స్‌గా పని చేస్తుండగా.. భర్త విజయ్‌ భవానిపురం శ్రేయాస్ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పని చేస్తున్నాడు.

Next Story