వేర్వేరు రోడ్డు ప్రమాదాలు.. 10 మంది మృతి

Various road accidents.. 10 people were killed. తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలో గల విజయవాడ హైవే రక్తసిక్తమైంది.

By అంజి  Published on  16 Jan 2022 6:59 AM GMT
వేర్వేరు రోడ్డు ప్రమాదాలు.. 10 మంది మృతి

గుజరాత్‌ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బనస్కాంత జిల్లాలోని థారాడ్-ధనేరా హైవేపై ఆదివారం ఉదయం కారును ట్రక్కు ఢీకొనడంతో ఐదుగురు వ్యక్తులు మరణించారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసు బృందం ఘటనా స్థలానికి చేరుకుంది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. స్థానిక థారాడ్ పోలీస్ స్టేషన్ అధికారి మాట్లాడుతూ.. "హైవేపై కారును ట్రక్కు ఢీకొట్టింది. ఐదుగురు వ్యక్తులు మరణించారు. వీరిలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. ఇద్దరు వ్యక్తులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు." అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలో గల విజయవాడ హైవే రక్తసిక్తమైంది. చౌటుప్పల్‌ మండల పరిధిలో చోటు చేసుకున్న రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందగా.. మరో ఆరుగురికి గాయాలు అయ్యాయి. ఆదివారం నాడు ఉదయం కారు, ఆర్టీసీ బస్సు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో కారులో ప్రమాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు హైదరాబాద్‌కు చెందిన చందు (35), సాయి పృథ్వీరాజ్‌ (23)గా గుర్తించారు. అలాగే బస్సులో ప్రయాణిస్తున్న ఐదుగురికి గాయాలయ్యాయి.

ఇక శనివారం రాత్రి చౌటుప్పల్‌ మండలంలోని లింగోజిగూడెం వద్ద బైక్‌ను కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న తండ్రికొడుకుల్లో.. తండ్రి దుర్మరణం చెందాడు. కొడుకుకు గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదం జరిగి 2 గంటలు గడవకముందే అదే ప్రాంతంలో మరో ప్రమాదం జరిగింది. టిప్పర్‌, బైక్‌ ఢీ కొన్నాయి. ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను వెలిమినేడులోని ఓ ప్రైవేట్‌ కంపెనీలో పని చేస్తున్న ఉద్యోగులుగా పోలీసులు భావిస్తున్నారు.

Next Story
Share it