ఓ వ్యక్తి ఐదుగురు అబ్బాయిలపై అత్యాచారానికి తెగబడిన ఘటన గుజరాత్ రాష్ట్రంలో వెలుగు చూసింది. ఈ ఘటన గుజరాత్‌లో సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. వారణాసి నియోజకవర్గంలోని గంగాపూర్‌లో మురారి లాల్ (38)కు అదే ఏరియాకు చెందిన ఓ కుటుంబంతో పరిచయం ఏర్పడింది. ఆ కుటుంబంలో 8 నుంచి 14 ఏళ్ల వయసున్న ఐదుగురు అబ్బాయిలు ఉన్నారు. పిల్లల తల్లిదండ్రులతో మురారి లాల్ కలివిడిగా మాట్లాడుతూ మంచివాడిగా నటించాడు. కామాక్షలోని మంచి స్కూల్‌లో పిల్లలను జాయిన్ చేయిస్తానని పిల్లల తల్లిదండ్రులకు చెప్పడంతో వారు నమ్మారు. ఆ తర్వాత వారిని స్కూల్‌లో జాయిన్ చేయించాడు మురారి లాల్. ఈ క్రమంలోనే మైనర్ బాలురను బీహెచ్‌యూ హెలీప్యాడ్ దగ్గరలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ఒక్కొక్కరిపై అత్యాచారానికి పాల్పడుతూ వచ్చాడు.
గత కొన్ని రోజులుగా ఆ నొప్పి భరించలేక జరిగిన దారుణాన్ని మైనర్ బాలురు వారి బంధువుకు ఒకరికి తెలిపారు. వెంటనే అతడు ఈ దారుణంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 377, పోక్సో చట్టంలోని 3,4 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని మంగళవారం నాడు పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీస్ కమిషనర్ ఎ సతీష్ గణేష్ తెలిపారు. నిందితుడు మురారి లాల్ జీవనోపాధి కోసం కోచింగ్ సెంటర్లు, ప్రైవేట్ స్కూళ్లలో పాఠాలు బోధించేవాడని పోలీసులు తెలిపారు. అంతే కాకుండా అతడు స్వలింగ సంపర్కుడని, ఈ విషయం తెలుసుకున్న అతని భార్య ఇద్దరు పిల్లలతో పాటు దూరంగా ఉంటోందని ఓ దినపత్రిక తన నివేదికలో వెల్లడించింది.