దారుణం : ప్రియురాలిని 6 ముక్కలుగా నరికిన ప్రియుడు
Uttar Pradesh Man Kills Ex Girlfriend. ఉత్తరప్రదేశ్‌లో ఓ వివాహితను యువకుడు ఆరు ముక్కలుగా నరికేసిన ఘటన సంచలనం సృష్టిస్తోంది.
By M.S.R Published on 21 Nov 2022 5:03 PM ISTఉత్తరప్రదేశ్‌లో ఓ వివాహితను యువకుడు ఆరు ముక్కలుగా నరికేసిన ఘటన సంచలనం సృష్టిస్తోంది. హత్య చేశాక.. అత్యంత పాశవికంగా ప్రవర్తించిన సదరు యువకుడు.. అనంతరం ఆ మృతదేహాన్ని ఓ బావిలో పడేశాడు. తలను పక్కనే చెరువులో పడేశాడు. అజంఘర్ జిల్లాలోని ఇషాక్‌పూర్ గ్రామానికి చెందిన ఆరాధనకు ప్రిన్స్ యాదవ్‌తో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆమె ఈ ఏడాది ప్రారంభంలో మరో యువకుడితో వివాహం చేసుకుంది. తనను కాదని వేరే వ్యక్తిని పెళ్లి చేసుకున్న ఆరాధనపై యాదవ్ కక్ష పెంచుకున్నాడు. నవంబర్ 9వ తేదీన ఆరాధనను యాదవ్ గుడికి రమ్మని చెప్పి బయటకు తీసుకు వచ్చాడు. ఆమెను చెరుకు తోటల్లోకి తీసుకెళ్లి అక్కడ అత్యంత దారుణంగా పదునైన ఆయుధాలతో చంపేశాడు.
స్నేహితుడి సహాయంతో ఆమెను 6 భాగాలుగా నరికేశాడు. తలను వేరు చేశాడు. అనంతరం ఆమె శరీర భాగాలను బావిలో పడేశాడు. నవంబర్ 15న బావిలో తేలియాడుతున్న శరీర భాగాలను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు వివాహిత శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో భాగంగా యాదవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అయితే ఆరాధన తల కోసం పశ్చిమి గ్రామ సమీపంలోని చెరువు వద్దకు యాదవ్‌ను తీసుకెళ్లగా, అక్కడ దాచిన తుపాకీతో పోలీసులపై కాల్పులు జరిపాడు. దీంతో పోలీసులు కూడా అప్రమత్తమై ఎన్‌కౌంటర్ చేశారు. దీంతో యాదవ్ గాయపడ్డాడు. ఈ కేసులో యాదవ్‌తో సహా మరికొందరిని పోలీసులు అరెస్టు చేశారు.