దారుణం.. అత్యాచారానికి గురైన బాలిక తల్లిపై పోలీస్ రేప్.!
Uttar Pradesh Cop held for raping mother of teen survivor. ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. అత్యాచారానికి గురైన ఓ బాలిక తల్లిపై రేప్ జరిగింది.
By అంజి Published on 30 Aug 2022 10:13 AM IST
ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. అత్యాచారానికి గురైన ఓ బాలిక తల్లిపై రేప్ జరిగింది. అయితే ఈ అఘాయిత్యానికి పాల్పడింది బాలిక కేసును విచారిస్తున్న పోలీసు. కన్నౌజ్ జిల్లాలోని సదర్ ప్రాంతంలో తన అధికారిక క్వార్టర్‌లో 17 ఏళ్ల అత్యాచార బాధితురాలి తల్లిపై అత్యాచారం చేసినందుకు ఒక పోలీసు అధికారిని అరెస్టు చేసినట్లు అధికారులు సోమవారం తెలిపారు. సదర్‌లో ఇటీవల 17 ఏళ్ల అత్యాచారానికి గురైంది. ఈ క్రమంలోనే ఈ కేసు విచారణ చేపట్టిన ఇన్‌స్పెక్టర్ అనూప్ మౌర్య.. కన్ను బాధిత బాలిక తల్లిపై పడింది.
కేసు విచారణలో భాగంగా ఆగస్టు 28న తన క్వార్టర్స్‌కు సమీపంలోని పెట్రోల్ బంక్ దగ్గరికి రావాలని బాధితురాలి తల్లికి పోలీస్ ఫోన్ చేశాడు. ఆమెను పెట్రోల్ బంక్ నుంచి తన క్వార్టర్స్‌కు తీసుకెళ్లారు. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేరు. చివరికి అత్యాచార బాధితురాలి తల్లిని రేప్ చేశారు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టాలని సదర్ సీఐకి అధికారులు ఆదేశాలు జారీ చేశారు. పోలీసుల విచారణలో మహిళపై పోలీసు అత్యాచారానికి పాల్పడినట్టుగా తేలింది.
దీంతో నిందితుడు ఇన్‌స్పెక్టర్ అనుప్ మౌర్యను సస్పెండ్ చేశారు. అయితే తాను రేప్ చేయలేదని, కొన్ని పత్రాలపై సంతకాలు తీసుకోవడానికి బాధితురాలి తల్లిని తన ఇంటికి పిలిచినట్లు అరెస్టయిన పోలీసు అధికారి తెలిపారు. అతన్ని కోర్టు ముందు హాజరుపరిచి జైలుకు పంపినట్లు కన్నౌజ్ ఎస్పీ కున్వర్ అనుపమ్ సింగ్ తెలిపారు. మరోవైపు దేశవ్యాప్తంగా మహిళలు, బాలికలపై అత్యాచారాలు ఆందోళనకర రీతిలో పెరిగిపోతున్నాయి. అత్యాచార బాధితుల్లో 99 శాతం మందికి నేరస్తుల గురించి తెలుసు అని తాజా ఎన్సీఆర్బీ నివేదికలో తేలింది.