రెండేళ్లుగా తల్లి మృతదేహాన్ని ఫ్రీజర్‌లో దాచిన కూతురు
US Woman Charged For Hiding Mother's Body In Freezer For Nearly 2 Years.అమ్మపై ప్రేమనో, మరేదైన కారణమో తెలీదు గానీ ఓ
By తోట వంశీ కుమార్ Published on 5 Feb 2023 10:40 AM ISTఅమ్మపై ప్రేమనో, మరేదైన కారణమో తెలీదు గానీ ఓ కూతురు తల్లి మృతదేహాన్ని రెండేళ్లుగా ఫ్రీజర్‌లో దాచి ఉంచింది. ఈ విషయం తన ఇంట్లో వాళ్లకు తెలియకుండా జాగ్రత్త పడింది. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది.
షికాగోలోని ఇల్లినాయిస్‌లో ఎవా బ్రాచర్ అనే 60 ఏళ్ల మహిళ నివసిస్తోంది. ఆమె తల్లి 96 ఏళ్ల రెజీనా మిచాల్స్కీ రెండు సంవత్సరాల క్రితం కాలం చేసింది. అయితే.. ఆ విషయాన్నిఎవా బ్రాచర్ ఎవ్వరికి తెలియనివ్వలేదు. అత్యంత జాగ్రత్తగా తల్లి మృతదేహాన్ని ఫ్రీజర్‌లో ఉంచింది. రెండు అంతస్తుల భవనంలో నివసిస్తున్న ఎవా బ్రాచర్.. తల్లి మృతదేహాన్ని అపార్ట్‌మెంట్ భవనం సెల్లార్‌లో ఉంచింది. ఎవ్వరూ కూడా అక్కడ మృతదేహం ఉన్నట్లు గుర్తించకుండా జాగ్రత్త పడింది.
ఇటీవల షికాగో పోలీసులు సెల్లార్‌లో రెజీనా మిచాల్స్కీ మృతదేహాన్ని గుర్తించారు. వెంటనే ఎవా బ్రాచర్‌ను అదుపులోకి విచారణ చేస్తున్నారు. కాగా.. తల్లి పేరుతో ఎవా బ్రాచర్ నకిలీ ఐడీలను కలిగి ఉన్నట్లు తెలిసింది. ఆమె తల్లి మరణించడానికి రెండు సంవత్సరాలకు ముందే కొనుగోలు చేసిన ఫ్రీజర్ బిల్లులు దొరికాయి.
ఇక్కడ అందరికీ అర్థం కాని విషయం ఏమిటంటే..? ఎందుకని ఆమె రెండు సంవత్సరాలు తన తల్లి చనిపోయిన విషయం ఎవ్వరికి చెప్పకుండా దాచిందని. ఇలా చేయడం వల్ల ఎవా బ్రాచర్ వచ్చే లాభం ఏమిటనేది తెలుసుకునే పనిలో పడ్డారు పోలీసులు.
ఇక్కడ మరో విషయం ఏమిటంటే ఎవా బ్రాచర్ కూతురు సబ్రీనా వాట్సన్‌కు అన అమ్మమ్మ చనిపోయిందన్న విషయం కూడా తెలియదు. తన తల్లిపై సబ్రీనా వాట్సన్ మండిపడింది. ఆమెకు ఎవరిపై ప్రేమ ఉండదని, ఆఖరికి తన మీద కూడా ఉండదని చెప్పుకొచ్చింది. తన అమ్మమ్మను తలుచుకుని విలపించింది.