ఢిల్లీలో కుమార్తెని కిడ్నాప్ చేసిన అమెరికా వ్యక్తి.. నేపాల్ కు తీసుకుని వెళ్ళిపోయాడు

US man kidnaps daughter from Delhi hotel. కనికా గోయల్ అనే మహిళ తన మాజీ భర్త, అత్త తన కుమార్తెను కిడ్నాప్ చేశారని

By M.S.R  Published on  20 April 2022 4:54 PM IST
ఢిల్లీలో కుమార్తెని కిడ్నాప్ చేసిన అమెరికా వ్యక్తి.. నేపాల్ కు తీసుకుని వెళ్ళిపోయాడు

కనికా గోయల్ అనే మహిళ తన మాజీ భర్త, అత్త తన కుమార్తెను కిడ్నాప్ చేశారని ఆరోపిస్తూ ఢిల్లీ పోలీసులకు ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. మహిళ తెలిపిన వివరాల ప్రకారం వారంతా కలిసి చిన్నారిని నేపాల్ తీసుకెళ్లేందుకు కుట్ర పన్నారు. మహిళ ఫిర్యాదు మేరకు ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి కూడా నోటీసులు అందాయి. కిడ్నాప్ చేసిన వ్యక్తులు US పౌరులు అని అంటున్నారు.

గోయల్, ఆమె భర్త గత కొంతకాలంగా విడివిడిగా ఉంటున్నారు. కోర్టు ఆదేశాల మేరకు ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 18 వరకు గోయల్ తన ఎనిమిదేళ్ల కుమార్తెను తన తండ్రిని కలవడానికి తీసుకువచ్చింది. ఢిల్లీ ఏరోసిటీలోని ఫైవ్ స్టార్ హోటల్‌లో చిన్నారిని దింపింది. మార్చి 15వ తేదీ రాత్రి 9 గంటల తర్వాత ఆమె తన కుమార్తెతో మాట్లాడలేకపోయింది.

మరుసటి రోజు (మార్చి 16) వారి గురించి తెలుసుకోడానికి గోయల్ హోటల్‌కు వెళ్లగా, ఆమె కుమార్తె, అలాగే ఆమె మాజీ భర్త, అతని తల్లి ఎక్కడా కనిపించలేదు. పోలీసులను సంప్రదించి, సీసీటీవీ కెమెరా ఫుటేజీని పరిశీలించగా, వారు ముగ్గురూ గత రాత్రి 10:45 గంటలకు టాక్సీలో హోటల్ నుండి బయలుదేరి వెళ్లిపోయారు. ఆ తర్వాత వారు తిరిగి రాలేదు. కొద్దిసేపటికే వారు నేపాల్‌లో ఉన్నారని తెలిసింది. ఢిల్లీ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తుండగా.. నేపాల్ రాయబార కార్యాలయంతో పాటు అమెరికా రాయబార కార్యాలయానికి సమాచారం అందించారు.
















Next Story