మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో మొబైల్ ఫోన్ కొనివ్వడానికి తల్లిదండ్రులు నిరాకరించడంతో బాలిక ఆత్మహత్య చేసుకుంది. 8వ తరగతి విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన నాగ్‌పూర్‌లోని చంకపూర్ ప్రాంతంలోని హనుమాన్ ఆలయం సమీపంలో జరిగింది. 13 ఏళ్ల ఎనిమిదో తరగతి విద్యార్థిని తల్లిదండ్రులు ఆమెకు కొత్త స్మార్ట్‌ఫోన్ కొనడానికి నిరాకరించినందుకు ఆత్మహత్య చేసుకుంది.
కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. 13 ఏళ్ల తమ కుమార్తెకు ఆన్‌లైన్ గేమ్‌లు అంటే చాలా ఇష్టం. చాలా రోజులుగా తల్లిదండ్రులను ఫోన్ కొనివ్వమని పట్టుబట్టింది. ఆదివారం మధ్యాహ్నం తల్లి, సోదరి బయటకు వెళ్లిన సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలిక దుపట్టాతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తల్లి, సోదరి తిరిగి వచ్చేసరికి బాలిక ఉరి వేసుకుని కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు.