భార్యను చంపి.. నేరుగా పోలీసులకు కాల్ చేసి..

మహారాష్ట్రలోని పుణెలో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి కట్టుకున్న భార్యను కిరాతకంగా చంపేసి, ఆ తర్వాత పోలీసులకు ఫోన్ చేసి తానే హత్య చేసినట్లు అంగీకరించాడు.

By -  Medi Samrat
Published on : 1 March 2026 8:50 PM IST

భార్యను చంపి.. నేరుగా పోలీసులకు కాల్ చేసి..

మహారాష్ట్రలోని పుణెలో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి కట్టుకున్న భార్యను కిరాతకంగా చంపేసి, ఆ తర్వాత పోలీసులకు ఫోన్ చేసి తానే హత్య చేసినట్లు అంగీకరించాడు. ఖడ్కీ ప్రాంతానికి చెందిన 56 ఏళ్ల దిలీప్ నంబూరి, తన 53 ఏళ్ల భార్య బిందుతో కలిసి ఉంటున్నాడు.

ఇటీవల వ్యాపారంలో నష్టాలు రావడంతో అతను తీవ్రమైన అప్పుల పాలై ఒత్తిడిలో ఉన్నాడు. దానికి తోడు, దిలీప్ తన మొదటి భార్యను రహస్యంగా కలుస్తున్నాడన్న అనుమానంతో బిందు తరచూ అతనితో గొడవ పడేది. ఈ క్రమంలోనే రాత్రి ఇద్దరి మధ్య మరోసారి తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో కోపంతో రగిలిపోయిన దిలీప్.. ఆమె ముఖంపై బ్లాంకెట్ గట్టిగా నొక్కిపెట్టి, ఊపిరి ఆడకుండా చేసి దారుణంగా హత్య చేశాడు. ఆ వెంటనే నేరుగా పోలీసు కంట్రోల్ రూమ్‌కు కాల్ చేసి తాను చేసిన నేరాన్ని చెప్పాడు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, నిందితుడిని అరెస్ట్ చేశారు.

Next Story