నిందితుల బెదిరింపులతో.. నిప్పంటించుకున్న అత్యాచార బాధితురాలు
Upset over constant threats, rape survivor sets herself on fire in Uttarpradesh. నిందితుల నిరంతర బెదిరింపులతో మనస్థాపం చెంది అత్యాచార బాధితురాలు నిప్పంటించుకుని
By అంజి Published on 24 Nov 2022 7:40 PM IST
నిందితుల నిరంతర బెదిరింపులతో మనస్థాపం చెంది అత్యాచార బాధితురాలు నిప్పంటించుకుని ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్ జిల్లా ఫతేఘర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బెయిల్‌పై బయటకు వచ్చిన నిందితులు కేసును ఉపసంహరించుకోవాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని బాధితురాలిని బెదిరించారు.
గత ఏడాది సామూహిక అత్యాచారానికి గురైన బాధితురాలిని జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆపై ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, ఆమె కాలిన గాయాలతో ప్రాణాలతో పోరాడుతోంది. అత్యాచార ఘటన జనవరి 2021 నాటిదని, ఇద్దరు నిందితులు పొలాల్లో ఉన్నప్పుడు బాలికను అపహరించినట్లు పోలీసులు తెలిపారు.
ఆగస్టు నెలలో బెయిల్ పొందిన నిందితులు బాలికను బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించారు. నిత్యం బెదిరింపులతో కలత చెందిన అత్యాచార బాధితురాలు తన శరీరంపై డీజిల్ పోసుకుని నిప్పంటించుకుని సఫాయి వైద్య కళాశాలలో చికిత్స పొందుతోంది. ఈ ఏడాది ఆగస్టులో బెయిల్ పొందిన ఇద్దరు నిందితులు, కేసును ఉపసంహరించుకోవాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని బాలికను బెదిరించారు. నిందితులు నిరంతరం ఆమెపై ఒత్తిడి పెంచుతుండడంతో ఆమె నవంబర్ 7న తీవ్ర చర్య తీసుకుంది.
ఆమె పరిస్థితి స్వల్పంగా మెరుగుపడడంతో కుటుంబ సభ్యులు ఆమెను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. బాలిక తండ్రి.. శివ ఓం, అంకిత్‌గా గుర్తించబడిన ఇద్దరు నిందితులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారిని అరెస్టు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి
బాధితురాలి తండ్రి మాట్లాడుతూ.. "మా గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు నా కుమార్తెపై అత్యాచారం చేశారు. మేము ఫతేఘర్ పోలీస్ స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేసాము. నిందితులు జైలు నుండి విడుదలైన తర్వాత, వారు కేసును ఉపసంహరించుకోవాలని నా కుమార్తెను బెదిరించడం ప్రారంభించారు. ఆమె వివాహం జరగకుండా కుట్ర చేశారు. ఇద్దరు వ్యక్తులు నా కుమార్తె జీవితాన్ని నాశనం చేశారు. ఆమె తనను తాను నిప్పంటించుకుంది." అని చెప్పారు.
అత్యాచార బాధితురాలిని బెదిరించినందుకు నిందితులపై కేసు నమోదు చేశామని, వీలైనంత త్వరగా నిందితులను పట్టుకునేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నామని పోలీసు సూపరింటెండెంట్ అశోక్ మీనా తెలిపారు.