అందరి ముందూ ఎగతాళి చేసింద‌ని వదినను ఏం చేశాడంటే..

ఒక వ్యక్తిని అత‌ని వదిన బహిరంగంగా ఎగతాళి చేసింది. దీంతో కోపం తెచ్చుకున్న ఆ వ్యక్తి ఆమెను అతి దారుణంగా హత్య చేశాడు

By Medi Samrat  Published on  8 Nov 2024 6:13 PM IST
అందరి ముందూ ఎగతాళి చేసింద‌ని వదినను ఏం చేశాడంటే..

ఒక వ్యక్తిని అత‌ని వదిన బహిరంగంగా ఎగతాళి చేసింది. దీంతో కోపం తెచ్చుకున్న ఆ వ్యక్తి ఆమెను అతి దారుణంగా హత్య చేశాడు. ఉత్తరప్రదేశ్‌లోని బండా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఏఎస్పీ) శివరాజ్ మాట్లాడుతూ.. నవంబర్ 3వ తేదీ ఉదయం పద్మాయి గ్రామంలోని పశువుల కొట్టంలో ఆశా అలియాస్ గుడియా కుష్వాహ (30) మృతదేహం లభించిందని తెలిపారు.

గుర్తు తెలియని వ్యక్తిపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు. విచారణలో అదే గ్రామానికి చెందిన సునీల్ అలియాస్ బుక్క కుష్వాహ (23) ప్రధాన నిందితుడని తేలింది. అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. వదిన ఆశ తనను ఎప్పుడూ తిడుతూ ఉండడంతో కోపం తెచ్చుకుని దాడి చేసినట్లు సునీల్ అంగీకరించాడు. తనను ఇతరుల ముందు తరచుగా ఎగతాళి చేసేదని, అందుకే హత్యకు పాల్పడినట్లు తెలిపాడు సునీల్. నవంబర్ 2 రాత్రి, ఆమె గదిలోకి పైకప్పు నుండి ప్రవేశించి, ఆమె నిద్రిస్తున్నప్పుడు వెదురు కర్ర, ఇటుకతో తలపై బాది హత్య చేశాడు. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని దాచిపెట్టేందుకు పశువుల కొట్టానికి ఈడ్చుకెళ్లాడు. సునీల్ చేసిన ఈ దారుణం తెలిసి గ్రామస్థులు నిర్ఘాంతపోయారు.

Next Story