ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్‌లోని సబ్-ఇన్‌స్పెక్టర్ బంగాళదుంపలు లంచంగా డిమాండ్ చేసినందుకు సస్పెండ్ అయ్యాడు. అయితే బంగాళదుంప అనే పదాన్ని లంచానికి కోడ్‌గా ఉపయోగించినట్లు దర్యాప్తులో తేలింది. ఎస్.ఐ. రామ్ కృపాల్ సింగ్ కేసును పరిష్కరించేందుకు లంచం అడిగాడని ఆరోపించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. సౌరిఖ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భావల్‌పూర్ చపున్నా చౌకీలో విధులు నిర్వహిస్తున్న సబ్ ఇన్‌స్పెక్టర్‌ను సస్పెండ్ చేస్తూ కన్నౌజ్ ఎస్పీ అమిత్ కుమార్ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసుపై శాఖాపరమైన విచారణ కూడా చేపట్టారు.
వైరల్ ఆడియోలో.. నిందితుడైన పోలీసు ఒక రైతును 5 కిలోల బంగాళాదుంపలు అడిగాడు. అతడు అతని డిమాండ్‌ను తీర్చలేకపోయాడు. బదులుగా 2 కిలోలు మాత్రమే ఇచ్చాడు. కన్నౌజ్ పోలీసు సూపరింటెండెంట్ ఈ ఆడియో విన్నాక చర్యలకు ఉపక్రమించారు. అతనిని సస్పెండ్ చేశారు. శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. కన్నౌజ్ సిటీ సర్కిల్ అధికారి కమలేష్ కుమార్‌కు కేసు దర్యాప్తు బాధ్యతలు అప్పగించారు. అయితే దర్యాప్తు చేయడానికి కూడా లంచం డిమాండ్ చేసి అడ్డంగా దొరికిపోయాడు.