సాగర్ జలాశయంలో దూకిన పెళ్లి కాని జంట

Unmarried couple jumps into Nagarjuna Sagar canal. సోమవారం మధ్యాహ్నం నాగార్జున సాగర్ జలాశయం ఎడమ కాల్వలో పెళ్లి కాని జంట దూకింది.

By Medi Samrat  Published on  21 March 2022 2:21 PM IST
సాగర్ జలాశయంలో దూకిన పెళ్లి కాని జంట

సోమవారం మధ్యాహ్నం నాగార్జున సాగర్ జలాశయం ఎడమ కాల్వలో పెళ్లి కాని జంట దూకింది. వీరిని గమనించిన స్థానికులు మహిళను రక్షించగా.. మ‌రో వ్యక్తి కనిపించకుండా పోయాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం క‌నిపించ‌కుండా పోయిన వ్య‌క్తి పీఏ పల్లి మండలం నర్సింహ తండాకు చెందిన వ్యక్తి బాలకృష్ణ (20)గా గుర్తించారు. బాల‌కృష్ణ‌ గత కొంతకాలంగా మైనర్ బాలిక అయిన తన కోడలును ప్రేమిస్తున్నాడు. వీరి వివాహాన్ని పెద్ద‌లు తిరస్కరించారు.

దీంతో వారు ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌ని నిర్ణయించుకున్నారు. సోమవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో హాలియాకు వచ్చిన వారిద్దరూ రిజర్వాయర్ ఎడమ కాల్వలోకి దూకారు. నీటి ప్రవాహంలో ఇరువురూ కొట్టుకుపోతుండగా.. గ్రామస్తులు, పోలీసులు తాడు సహాయంతో మహిళను రక్షించారు. బాలకృష్ణ ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అధికారులు గ‌జ‌ ఈతగాళ్లను రంగంలోకి దించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.



























Next Story