రైలు ఢీకొని పెళ్లికాని జంట మృతి.. ఆత్మహత్యగా అనుమానం.. ఏపీకి చెందిన యువతితో పాటు..

Unmarried couple dies after being hit by train.. cops suspect suicide. అంబత్తూరు రైల్వే స్టేషన్ సమీపంలో చెన్నైలో పెళ్లికాని జంటను ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొట్టింది.

By అంజి  Published on  21 Dec 2021 4:05 PM IST
రైలు ఢీకొని పెళ్లికాని జంట మృతి.. ఆత్మహత్యగా అనుమానం.. ఏపీకి చెందిన యువతితో పాటు..

అంబత్తూరు రైల్వే స్టేషన్ సమీపంలో చెన్నైలో పెళ్లికాని జంటను ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొట్టింది. సోమవారం అర్ధరాత్రి 12:30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరగ్గా, తెల్లవారుజామున 4 గంటలకు వారి మృతి గురించి పోలీసులకు సమాచారం అందింది. అయితే యువతి, యువకుడి సంబంధాన్ని వారి కుటుంబాలు వ్యతిరేకిస్తున్నాయని, ఇది ఆత్మహత్య కేసు కావచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. వివరాల ప్రకారం.. ఇద్దరూ వేర్వేరు రాష్ట్రాలకు చెందినవారు. పాడిలోని వేర్వేరు హాస్టళ్లలో ఉంటున్నారు.

మృతులు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎస్ శరణ్యశ్రీ (20), తిరువణ్ణామలైకి చెందిన ఎం జయకుమార్ (25)గా గుర్తించారు. జయకుమార్ ఓ ప్రైవేట్ బ్యాంకులో మనీ కలెక్షన్ ఏజెంట్‌గా పనిచేశారని, ఆ మహిళ ఆటోమొబైల్ తయారీ యూనిట్‌లో పనిచేశారని తెలిసింది. రైలు ఎక్కడానికి అంబత్తూరు రైల్వే స్టేషన్‌కు చేరుకున్న ప్రయాణికులు.. రెండు మృతదేహాలను చూసి ఆశ్చర్యానికి గురైన తర్వాత సంఘటన వెలుగులోకి వచ్చింది. స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించగా, కేసు నమోదు చేశారు. తదుపరి విచారణ జరుగుతోంది.

Next Story