ప్రాణం తీసిన అండర్‌వేర్..
Underwear Theft Leads to Murder in UP’s Kanpur Dehat. చిన్నచిన్న విషయాలే ప్రాణం మీదకు తెస్తున్నాయి. తాజాగా అండర్‌వేర్
By Medi Samrat Published on 27 Feb 2021 8:38 AM ISTచిన్నచిన్న విషయాలే ప్రాణం మీదకు తెస్తున్నాయి. తాజాగా అండర్‌వేర్ ప్రాణం తీసింది. డ్రాయర్‌ను దొంగలించి సరదాగా స్నేహితుడిని ఆటపట్టిద్దామని అనుకోగా.. అది కాస్త ప్రాణం మీదకు వచ్చింది. సరదా కోసం చేసిన ప్రాణాలు తీసుకునే వరకూ వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఈ ఘటన జరిగింది.
వివరాళ్లోకెళితే.. కాన్పూర్ జిల్లా దేహక్‌లోని ఓ పారిశ్రామిక వాడలో మిత్రులు అజయ్ కుమార్, వివేక్ శుక్లా ఒకే గదిలో ఉంటున్నారు. అజయ్‌ను ఆట పట్టిద్దామని వివేక్ సరదాగా అతడి డ్రాయర్ దొంగిలించాడు. అజయ్ అండర్‌వేర్ కోసం గదిలో వెతకగా కానరాలేదు. దీంతో మిత్రుడు వివేక్‌ను అడగ్గా.. తానే వేసుకున్నానని ఆట పట్టించాడు.
దీంతో కోపోద్రిక్తుడైన అజయ్.. వివేక్‌తో వాగ్వాదానికి దిగాడు. ఆవేశంలో వివేక్‌ను కూరగాయలు కోసే కత్తితో పలుసార్లు పొడిచాడు. వివేక్ తీవ్ర గాయాలపాలయ్యాడు. రక్తపుమడుగులో కొట్టుమిట్టాడుతున్న వివేక్‌ను చూసి భయపడ్డ అజయ్.. అక్కడి నుండి పరారయ్యాడు.
పక్కనున్న తోటి కార్మికులు విషయం తెలుసుకుని వివేక్‌ను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే వివేక్ మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు అజయ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఏదేమైనా సరదా కోసం చేసిన ఓ నిండు ప్రాణం బలికోరింది.