మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ నగరంలోని రౌ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఓ సూట్‌కేస్ కలకలం సృష్టించింది. సూట్‌కేస్‌ను తెరిచి చూడగా అక్కడ ఉన్న వ్యక్తులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. సూట్‌కేస్‌లోంచి ఎనిమిదేళ్ల బాలుడు బయటకు వచ్చి ఏడవడం మొదలుపెట్టాడు. ఇది గమనించిన ప్రజలు వెంటనే రావ్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. మధ్యాహ్నం సమయంలో రోడ్డు పైన ఓ సూట్‌కేస్ పడి ఉండటం పలువురు చూశారు. కొందరు వ్యక్తులు సూట్‌కేస్ దగ్గరికి రాగానే.. ఆ సూట్‌కేస్ కాస్తా కదలడం మొదలైంది. సూట్‌కేసు తెరిచి చూడగా అక్కడ ఉన్న వ్యక్తులు కాస్తా షాక్ అయ్యారు.
సూట్‌కేస్‌లో 8 ఏళ్ల పిల్లాడు ఉన్నాడు. సూట్‌కేస్‌లోంచి బయటకు రాగానే పిల్లవాడు బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టాడు. చిన్నారిది నిరుపేద కుటుంబమని తెలుస్తోంది. సూట్‌కేసులో ఎలా వచ్చాడో తెలియదు. అదే సమయంలో ఈ ఘటన గురించి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సూట్‌కేస్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు చిన్నారిని విచారణ నిమిత్తం తీసుకెళ్లారు. ఈ సూట్‌కేస్‌ను ఎవరు అక్కడ విసిరారో పోలీసులు ఆరా తీస్తున్నారు. పిల్లాడి తల్లిదండ్రుల గురించి కూడా వివరాలు తెలుసుకునే పనిలో ఉన్నారు.