వచ్చే జన్మలో అయినా పెళ్లి చేసుకుంటా..ప్రియురాలి మృతి తట్టుకోలేక ప్రియుడు సూసైడ్
ప్రియురాలి మృతిని తట్టుకోలేక ఓ ప్రియుడు ఆత్మ హత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
By Knakam Karthik
వచ్చే జన్మలో అయినా పెళ్లి చేసుకుంటా..ప్రియురాలి మృతి తట్టుకోలేక ప్రియుడు సూసైడ్
ప్రియురాలి మృతిని తట్టుకోలేక ఓ ప్రియుడు ఆత్మ హత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది... మంచిర్యాల జిల్లా దండే పల్లి మండలం కొర్విచల్మ గ్రామానికి చెందిన దుంపటి అంజన్న కూతురు హిత వర్షిణి(20) ఘట్కేసర్ల్‌లోని విజ్ఞాన్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతుంది. నాలుగు రోజులు సెలవు రావడంతో హితవర్షిణి ఇంటికి వెళ్లి 7వ తేదీన ఆదివారం మధ్యాహ్నం సమయంలో కాలేజీకి వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుండి బయలు దేరింది. ఈ క్రమంలోనే హితవర్షిణి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో తల్లిదండ్రులు కంగారుపడి హైదరాబాదులో ఉన్న వారి బంధువులకు సమాచారాన్ని అందించారు. దీంతో బంధువులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హితవర్షిణి ఫోన్ ట్రాక్ చేసి అక్కడికి వెళ్లి చూడగా హిత వర్షిణి రైలు పట్టాల మధ్యలో పడిపోయి ఉంది. హిత వర్షిణి తలకు తీవ్ర గాయాలు కావడం తో ఆమె మరణించినట్లుగా పోలీసులు గుర్తించారు.
అయితే హితవర్షిణి హైదరాబాద్‌కు వచ్చి బీబీనగర్-ఘట్కేసర్ మధ్య లోని రైల్వే ట్రాక్ వద్ద రైలు కింద పడి ఆత్మ హత్య చేసుకు న్నట్లుగా పోలీసులు గుర్తించారు. దీంతో పోలీసులు యువతి ఫోన్ చెక్ చేయగా యువతి చివరిసారి గా తన గ్రామానికి చెందిన వినయ్ బాబు (28) అనే అబ్బాయి తో మాట్లాడినట్లుగా తెలుసుకున్న పోలీసులు ఆ యువకుడ్ని విచారించేందుకు వెళ్లగా... అతను కూడా బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలుసుకున్నారు.
కాగా ఆత్మహత్యకు ముందు వినయ్ బాబు రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వచ్చే జన్మలో అయిన నా బంగారు తల్లిని పెళ్లి చేసుకుంటా అంటూ సూసైడ్ నోటు రాసి ఆత్మహత్య చేసు కున్నాడు.సూసైడ్ నోట్ ఆధారంగా చేసుకుని...వీరిద్దరూ ప్రేమించు కుంటున్నారని, పెద్దలు వీరి పెళ్లికి నిరాకరించడంతో ఈ దారుణానికి పాల్పడినట్లుగా పోలీసులు నిర్ధారించారు. హిత వర్షిణి మృతిపై అనుమా నాలు ఉన్నాయని తండ్రి పోలీసులకు చెప్పారు. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి న్యాయం చేయా లంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.