బెయిల్‌పై బయటకు వచ్చాడు.. అయినా నైజం మార్చని అత్యాచార నిందితుడు
Ulhasnagar police have arrested a 20-year-old rape accused. బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత బాధిత 15 ఏళ్ల బాలికను 20 ఏళ్ల అత్యాచార నిందితుడు
By M.S.R Published on 16 Jan 2023 9:00 PM ISTబెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత బాధిత 15 ఏళ్ల బాలికను 20 ఏళ్ల అత్యాచార నిందితుడు మరోసారి వేధించడం మొదలుపెట్టాడు. దీంతో అతడిని ఉల్హాస్‌నగర్ పోలీసులు అరెస్టు చేశారు. 2021లో అహ్మద్‌నగర్ ప్రాంతంలో నాలుగు నెలలపాటు బాలికను కిడ్నాప్ చేసి, పలుమార్లు అత్యాచారం చేసినందుకు మంగేష్ సోనావానేని గత ఏడాది అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
మంగేష్ సోనావానే బాధితురాలి కాలేజీ దగ్గర ఆమెను వెంబడించడం ప్రారంభించాడు. తనతో సన్నిహితంగా ఉండమని మంగేష్ సోనావానే కోరాడు. జనవరి 11న ఆమె అతడిని పట్టించుకోకపోవడంతో, అతను ఆమె జుట్టు పట్టుకుని లాగి, బ్లేడ్ చూపించి తాను చెప్పింది వినకపోతే చంపేస్తానని బెదిరించాడని బాలిక తెలిపింది. "అతను నన్ను బలవంతంగా కాలేజీకి సమీపంలోని ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లాడు. అతనితో సన్నిహితంగా ఉండమని నన్ను అడిగాడు. నేను అతనితో మాట్లాడటం ఇష్టం లేదని చెప్పడంతో, అతను ఒక బ్లేడ్ తీసి చంపేస్తానని, అత్యాచారం చేస్తానన్ని చెప్పాడు. నేను భయపడిపోయాను, కానీ అటుగా వెళుతున్న వాళ్లు, సీనియర్లు జోక్యం చేసుకుని నన్ను రక్షించారు, ” అని ఆమె తెలిపింది.
నేను మళ్ళీ రేపు వస్తానని చెప్పి వెళ్లాడని ఆమె వాపోయింది. మరుసటి రోజు జనవరి 12న తన తల్లిదండ్రులకు ఈ విషయాన్ని తెలియజేసింది. హిల్ లైన్ పోలీస్ స్టేషన్‌కి వెళ్లి అతనిపై కొత్తగా ఫిర్యాదు చేశారు. పలు సెక్షన్స్ కింద తాజా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సోనావానే మరుసటి రోజు జనవరి 13న కళాశాలకు వచ్చినప్పటికీ, బాలిక తన తల్లితో ఉండటం చూసి పారిపోయాడు. జనవరి 14 న అతడిని పోలీసులు అరెస్టు చేశారు. 2021 నవంబర్‌లో బాధిత బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసినందుకు అతన్ని గత ఏడాది మార్చిలో అరెస్టు చేశారు. గత సంవత్సరం నవంబర్‌లో జైలు నుండి బయటకు వచ్చాడు.. అప్పటి నుండి ఆమె కళాశాల సమీపంలో వెంబడిస్తూ బెదిరిస్తూ వస్తున్నాడని పోలీసులు తెలిపారు.