వీధికుక్కల దాడిలో గాయపడ్డ పిల్లాడు.. సీసీటీవీ విజువల్స్ చూస్తుంటే.!

అల్లాపూర్‌లోని రాణాప్రతాప్‌నగర్‌లో వీధికుక్కల గుంపు దాడి చేయడంతో రెండున్నరేళ్ల బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి

By Kalasani Durgapraveen  Published on  3 Nov 2024 9:15 PM IST
వీధికుక్కల దాడిలో గాయపడ్డ పిల్లాడు.. సీసీటీవీ విజువల్స్ చూస్తుంటే.!

హైద‌రాబాద్‌ అల్లాపూర్‌లోని రాణాప్రతాప్‌నగర్‌లో వీధికుక్కల గుంపు దాడి చేయడంతో రెండున్నరేళ్ల బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. చిన్నారి తన నివాసం బయట ఆడుకుంటూ ఉండగా వీధికుక్కలు దాడి చేశాయి.

రెండు కుక్కలు సమీపిస్తున్నప్పుడు బాలుడు తిరిగి లోపలికి పరిగెత్తడానికి ప్రయత్నించాడు. అకస్మాత్తుగా ఒక నల్ల కుక్క పిల్లాడి మీదకు దూసుకెళ్లి అతని చేయి పట్టుకుని వీధిలోకి లాగింది. కొద్దిసేపటి తర్వాత, మరో రెండు కుక్కలు బాలుడిని కరిచాయి. అతని ఏడుపు విని సమీపంలోని ఇద్దరు స్త్రీలు బయటకు పరిగెత్తుకుని వచ్చారు. వారు కుక్కలను భయపెట్టి, పారిపోయేలా చేశారు. గాయపడిన పిల్లవాడిని వెంటనే సమీప ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ కుక్క కాటుకు చికిత్స పొందుతున్నాడు.

Next Story