పెన్నా బ్యారేజీ సమీపంలో మంగళవారం రెండు గుర్తు తెలియని మృతదేహాలు లభ్యమవడంతో ఆ ప్రాంతంలో ఆందోళన నెలకొంది. బాధితులు, ఇద్దరు యువకులను దారుణంగా కొట్టి చంపారని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాల కోసం సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు.
నెల్లూరులో పెన్నా నది సమీపంలో డబుల్ మర్డర్ కేసులో నిందితుల కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించడంతో పాటు టవర్ డంప్‌ను సంతపేట పోలీసులు సేకరిస్తున్నారు. పెన్నా బ్యారేజీ వద్ద రోడ్డుపై రక్తపు మరకలు ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. గజ ఈతగాళ్ల సాయంతో రెండు మృతదేహాలను పోలీసులు వెలికి తీశారు.