ప్రాణాలు తీసిన ఈత స‌ర‌దా.. ఇద్ద‌రు యువ‌కులు మృతి

Two teenagers drown in Kinnerasani stream. ఈత స‌ర‌దా ఇద్ద‌రు యువ‌కుల ప్రాణాలు తీసింది. భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలోని

By Medi Samrat  Published on  28 Jun 2022 2:57 PM GMT
ప్రాణాలు తీసిన ఈత స‌ర‌దా.. ఇద్ద‌రు యువ‌కులు మృతి

ఈత స‌ర‌దా ఇద్ద‌రు యువ‌కుల ప్రాణాలు తీసింది. భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలోని పాల్వంచ‌ మండలం కిన్నెరసాని స‌మీపంలో గ‌ల‌ కరకవాగులో మంగళవారం ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న సోహైల్ పాషా (18), పదో తరగతి చదువుతున్న అనిల్ కుమార్ (16) ఇతర స్నేహితులతో కలిసి ఈత కొట్టేందుకు వాగు వ‌ద్ద‌కు వెళ్లారు.

పాషా మొదట టైర్ ట్యూబ్ సహాయంతో ఈత కొట్టడానికి నీటిలోకి ప్రవేశించాడు, దుర‌దృష్ట‌వశాత్తు అతను నీటిలో కొట్టుకుపోయాడు. పాషా నీటిలో మునిగిపోవడాన్ని గమనించిన అనిల్ కుమార్ కర్ర సహాయంతో రక్షించే ప్రయత్నం చేశాడు. అదుపు తప్పి నీటిలో పడిపోవడంతో అతను కూడా నీటిలో మునిగిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని మృతదేహాలను వెలికితీశారు.


Next Story
Share it