ములుగు జిల్లాలో ఎదురుకాల్పులు.. ఇద్దరు మావోయిస్టులు హతం
Two Maoists killed in encounter in Mulugu district.పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు
By తోట వంశీ కుమార్ Published on
18 Jan 2022 5:21 AM GMT

పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు హతమయ్యారు. ఈ ఘటన తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ములుగు జిల్లా వెంటాపురం మండలంలోని కర్రెగుట్టల అటవీ ప్రాంతంలో చోటు చేసుకుంది. మంగళవారం తెల్లవారుజామున కర్రెగుట్టల అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మవోయిస్టులు మృతి చెందగా.. మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్కు గాయాలయ్యాయి. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలించేందుకు ప్రత్యేక హెలికాఫ్టర్ ఏర్పాటు చేశారు. కాగా.. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Next Story