వరంగ‌ల్‌లో విషాదం.. పాత భవనం కూల్చివేత‌లో ఇద్ద‌రు కార్మికులు మృతి

Two killed during demolition drive of an old building in Warangal. వరంగల్ పట్టణంలోని పాత భవనం కూల్చివేత సందర్భంగా శనివారం జరిగిన

By Medi Samrat
Published on : 11 Jun 2022 8:30 PM IST

వరంగ‌ల్‌లో విషాదం.. పాత భవనం కూల్చివేత‌లో ఇద్ద‌రు కార్మికులు మృతి

వరంగల్ పట్టణంలోని పాత భవనం కూల్చివేత సందర్భంగా శనివారం జరిగిన ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందగా, మరో ఇద్దరు కార్మికులు గాయపడ్డారు. పట్టణంలోని చార్‌భౌళి ప్రాంతంలో పాత కట్టడాన్ని కూల్చివేస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నిర్మాణంలో కొంత భాగం కార్మికులపై పడిందని.. దీంతో వారు శిథిలాల కింద చిక్క‌కుపోయార‌ని పోలీసులు తెలిపారు .

స‌మాచారం అంద‌డంతో ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న‌ పోలీసులు, మున్సిపల్ ఉద్యోగులతో పాటు సైట్‌లోని ఇతర కార్మికులతో క‌లిసి రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. ఇద్దరు కార్మికుల మృతదేహాలను శిథిలాల నుంచి బయటకు తీశారు. గాయపడిన మరో ఇద్దరు కార్మికులను ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. కూల్చివేతలో నిమగ్నమైన కొందరు కార్మికులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం విషాదానికి దారితీసిందని చెబుతున్నారు. ఈ ఘటనపై మున్సిపల్ అధికారులు విచారణకు ఆదేశించారు.









Next Story