ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన‌ ట్రాక్టర్.. ఇద్ద‌రు రైతులు మృతి

Two farmers killed as tractor collides with bike in Asifabad. కుమ్రంభీం అసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం బాబేఝరి గ్రామం వద్ద మంగళవారం రోడ్డుప్ర‌మాదం జరిగింది.

By Medi Samrat  Published on  24 Jan 2023 8:45 PM IST
ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన‌ ట్రాక్టర్.. ఇద్ద‌రు రైతులు మృతి

కుమ్రంభీం అసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం బాబేఝరి గ్రామం వద్ద మంగళవారం రోడ్డుప్ర‌మాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని ట్రాక్టర్ ఢీకొనడంతో ఇద్దరు రైతులు మృతి చెందారు. ప్ర‌మాదంలో పెందూరు రాము (35) అక్కడికక్కడే మృతి చెందగా, అతని స్నేహితుడు కొమ్రం బాదిరావు (45) తీవ్ర గాయాలపాలై ఆసిఫాబాద్‌లోని ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కెరమెరి సబ్ ఇన్‌స్పెక్టర్ ఎన్ వెంకటేష్ తెలిపారు. వీరిద్దరూ కెరమెరి మండలం జోడేఘాట్‌ గ్రామానికి చెందినవారుగా గుర్తించారు. రాముకు భార్య, ఐదుగురు కుమారులు, కుమార్తె ఉండగా, బాదిరావుకు నలుగురు కుమారులు ఉన్నారు. రాములు భార్య ఇంద్రాబాయి ఫిర్యాదు చేయడంతో పోలీసులు ట్రాక్టర్ డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న ట్రాక్టర్ డ్రైవర్‌ ని పట్టుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

Next Story