బంజారాహిల్స్‌లో కారు బీభత్సం.. ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి

Two died in road accident in banjarahills. హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నగరంలోని బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 2లో అర్ధరాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది.

By అంజి  Published on  6 Dec 2021 5:54 AM GMT
బంజారాహిల్స్‌లో కారు బీభత్సం.. ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి

హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నగరంలోని బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 2లో అర్ధరాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. రోడ్డు దాటుతున్న ఇద్దరు యువకులను వేగంగా దూసుకొచ్చిన కారు ఢీ కొట్టింది. దీంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. మృతులు అయోధ్యరాయ్‌, దేవేంద్ర కుమార్‌ దాస్‌గా పోలీసులు గుర్తించారు. మృతులు ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో పని చేస్తున్నారని పోలీసులు తెలిపారు.

మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రోడ్డు ప్రమాదం సంభవించడానికి కారణం డ్రైవర్‌ మద్యం మత్తులో ఉన్నాడని స్థానికులు తెలిపారు. ఘటన జరిగిన అనంతరం నిందితుడు జూబ్లీహిల్స్‌ వైపు పారిపోయాడు. ఆ వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ప్రమాదానికి కారణమైన కారును పోలీసులు పీఎస్‌కు తరలించారు. ఆ తర్వాత నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


Next Story
Share it