పాడుబడిన వ్యవసాయ బావిలో రెండు మృత‌దేహాలు.. భ‌యాందోళ‌న‌లో స్థానికులు

Two dead bodies found in well. సిద్ధిపేట జిల్లా బూరుగుపల్లి గ్రామంలో రెండు గుర్తుతెలియని మృతదేహాలు

By Medi Samrat
Published on : 27 April 2022 2:57 PM IST

పాడుబడిన వ్యవసాయ బావిలో రెండు మృత‌దేహాలు.. భ‌యాందోళ‌న‌లో స్థానికులు

సిద్ధిపేట జిల్లా బూరుగుపల్లి గ్రామంలో రెండు గుర్తుతెలియని మృతదేహాలు బావిలో కనిపించడంతో తీవ్ర క‌ల‌క‌లం రేగింది. గ్రామంలోని ఓ పాడుబడిన వ్యవసాయ బావిలో ఇద్దరు మగ వ్య‌క్తుల‌ మృతదేహాలు తేలుతూ క‌న‌బ‌డ్డాయి. దీంతో స్థానికులు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. మృతదేహాల నుంచి దుర్వాసన రావడంతో గ్రామస్థులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. గ్రామస్థుల సహాయంతో పోలీసులు మృతదేహాలను బయటకు తీసి.. చ‌నిపోయింది యువ‌కులుగా గుర్తించారు. అనంత‌రం పోస్టుమార్టం నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతదేహాలను గుర్తించేందుకు పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఈ ఘ‌ట‌న‌పై పూర్తి వివ‌రాలు తెలియాల్సివుంది. ఇటీవల పోలీస్ స్టేషన్ ప్రాంగణానికి సమీపంలో ఒక వ్యక్తి మృతదేహం కనుగొనబడింది. ఇది పరువు హత్యగా తేలిన విష‌యం తెలిసిందే.

Next Story