విశాఖ‌లో దారుణం.. తొమ్మిదో తరగతి బాలికపై అత్యాచారం

Two arrested for allegedly assaulting a 14-year old girl in Visakhapatnam. విశాఖపట్నంలోని యారాడ కొండపై బుధవారం రాత్రి ఓ యువకుడు బాలికపై

By Medi Samrat  Published on  18 Feb 2022 11:07 AM GMT
విశాఖ‌లో దారుణం.. తొమ్మిదో తరగతి బాలికపై అత్యాచారం

విశాఖపట్నంలోని యారాడ కొండపై బుధవారం రాత్రి ఓ యువకుడు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. న్యూపోర్టు సీఐ రాములు తెలిపిన వివరాల ప్రకారం.. పెదగంట్యాడ మండలానికి చెందిన బాలిక(14) తొమ్మిదో తరగతి చదువుతోంది. బాలికకు అదే ప్రాంతానికి చెందిన మద్ది గణేష్ రెడ్డి (19)తో పరిచయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో బుధవారం పెదగంట్యాడలో ఓ పార్టీకి యువతి తన సోదరితో కలిసి వెళ్లింది. కాసేపు గడిపిన తర్వాత అక్కడి నుంచి బాలిక అక్క ఇంటికి వెళ్లింది. అనంతరం బాలిక గణేష్ రెడ్డితో వెళ్లి కాసేపు గడిపింది.

రాత్రి 9.30 గంటల ప్రాంతంలో గణేష్ తన మామ గంగవరం రాజు, అలియాస్ మైలపిల్లి రాజు అలియాస్ గిటార్ రాజు (26)కి ఫోన్ చేసి రావాలని కోరాడు. ముగ్గురూ ద్విచక్ర వాహనంపై యారాడ తీరానికి వెళ్లారు. అనంతరం ఇద్దరు యువకులు మద్యం సేవించారు. ఇద్దరిలో గణేష్ మద్యం మత్తులో నిద్రపోతుండగా.. రాజు బాలికపై అత్యాచారం చేశాడు. బాలిక కొండపై నుంచి కిందకు వచ్చి పోలీసులకు సమాచారం అందించింది. న్యూపోర్టు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు న్యూపోర్టు సీఐ ఎస్‌.రాము తెలిపారు.


Next Story
Share it