ఖ‌మ్మంలో టీఆర్ఎస్ నేత దారుణ హ‌త్య‌

TRS Leader Thammineni Krishnaiah Murdered In Khammam. ఖమ్మం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య దారుణ

By Medi Samrat  Published on  15 Aug 2022 1:43 PM IST
ఖ‌మ్మంలో టీఆర్ఎస్ నేత దారుణ హ‌త్య‌

ఖమ్మం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య దారుణ హత్యకు గురయ్యాడు. తమ్మినేని కృష్ణయ్య సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంకు సోదరుడు. తెల్దారుపల్లి గ్రామంలో గుర్తుతెలియ‌ని దుండ‌గులు కృష్ణయ్యను నరికి చంపారు.

తమ్మినేని కృష్ణయ్య ఇటీవ‌ల‌ సీపీఎంను వీడి టీఆర్ఎస్ లో చేరారు. కృష్ణయ్య మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ద‌గ్గ‌రి మ‌నిషిగా చెబుతుంటారు. హత్యకు రాజ‌కీయ కార‌ణాలు ఏమైనా ఉన్నాయ‌నే అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. స‌మాచారం అందుకున్న పోలీసులు హ‌త్య జ‌రిగిన ప్ర‌దేశాన్ని ప‌రిశీలించారు. కృష్ణయ్యను హత్య చేసిన దుండగుల కోసం పోలీసులు వెతుకుతున్నారు. హ‌త్య‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Next Story