టీఆర్‌ఎస్‌ నాయకుడు దారుణ హత్య.. కుకునూర్‌ గ్రామంలో తల.. మంజీరా బ్యాక్‌వాటర్‌లో మొండెం

TRS leader brutally murdered in Sangareddy district. టీఆర్‌ఎస్‌ నాయకుడు, వ్యాపారి దారుణంగా హత్యకు గురైన ఘటన సంగారెడ్డి జిల్లాలో కలకలం రేపింది. బాధితుడి తలను మొండెం నుంచి వేరు

By అంజి  Published on  30 Jan 2022 2:34 AM GMT
టీఆర్‌ఎస్‌ నాయకుడు దారుణ హత్య.. కుకునూర్‌ గ్రామంలో తల.. మంజీరా బ్యాక్‌వాటర్‌లో మొండెం

టీఆర్‌ఎస్‌ నాయకుడు, వ్యాపారి దారుణంగా హత్యకు గురైన ఘటన సంగారెడ్డి జిల్లాలో కలకలం రేపింది. బాధితుడి తలను మొండెం నుంచి వేరు చేసి అతిక్రూరంగా హతమార్చారు దుండగులు. హత్య ఘటన బీడీఎల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. హత్యకు గురై టీఆర్‌ఎస్‌ ఎస్టీ సెల్‌ తెల్లపూర్‌ మున్సిపల్‌ ఉపాధ్యక్షుడు కడావత్‌ రాజునాయక్‌ వెలిమెల తండాలో నివసిస్తున్నాడు. ఈ క్రమంలోనే జనవరి 24 రాజునాయక్‌ అదృశ్యం అయ్యాడు. ఆ తర్వాత రోజు బీడీఎల్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. రాజునాయక్‌ అనుచరులు, తమ్ముడు గోపాల్‌ను పోలీసుల విచారించారు. దీంతో అసలు కథ వెలుగులోకి వచ్చింది. ఇంద్రకరణ గ్రామ సమీపంలో గోపాల్‌, మరో వ్యక్తి రాంసింగ్‌తో కలిసి రాజునాయక్‌ను హత్య చేసినట్లు పోలీసులు తమ విచారణలో తేల్చారు.

హత్యకు గల కారణంగా భూవివాదమే అని తెలుస్తోంది. వెలిమెల తండాలో రూ.10 కోట్ల విలువ గల 33 గుంటల భూమి విషయంలో రాజునాయక్‌కు, రాంసింగ్‌కు విబేధాలు ఉన్నాయి. అయితే రాజునాయక్‌ తమ్ముడు గోపాల్‌, రాంసింగ్‌ ఇద్దరూ ఫ్రెండ్స్‌. జనవరి 24వ తేదీన రాజునాయక్‌తో కలిసి తమ్ముడు గోపాల్‌, రాంసింగ్‌లు కారులో ఇంద్రకరణ్‌, క్యాసారం పరిసర ప్రాంతాల్లో ప్రయాణించారు. ఆ తర్వాత రాజునాయక్‌ ఫోన్‌ ట్రాకింగ్‌ ఆగిపోయింది. ఆ రోజే గోపాల్‌, రాసింగ్‌ సహా 8 మంది రాజునాయక్‌తో కలిసి మద్యం సేవించారు. మద్యం మత్తులో రాజునాయక్‌ను దారుణంగా హత్య చేసి తల, మొండెం వేరు చేశారు. తలను రాయికోడ్ మండలం కుకునూర్‌ గ్రామంలో పడేయగా.. మొండెంను న్యాల్‌కల్‌ మండలం రాఘవాపూర్‌ గ్రామ శివారు మంజీరా బ్యాక్‌ వాటర్‌లో పడేశారు. ఈ హత్యకు సంబంధించి పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.

Next Story
Share it