చివ‌రికి.. నా భార్య రక్తపు మడుగులో ప‌డి ఉందని పోలీసులకు చెప్పాడు

ఇంట్లో గొడవ కారణంగా తన భార్యను చంపి, మృతదేహంతో చాలా గంటలు గడిపాడు.

By Medi Samrat  Published on  12 Feb 2025 3:48 PM IST
చివ‌రికి.. నా భార్య రక్తపు మడుగులో ప‌డి ఉందని పోలీసులకు చెప్పాడు

ఇంట్లో గొడవ కారణంగా తన భార్యను చంపి, మృతదేహంతో చాలా గంటలు గడిపాడు. ఇక తప్పించుకోలేనని అనుకున్నాడో ఏమో కానీ.. తన నేరాన్ని నివేదించడానికి పోలీసు స్టేషన్‌కు వెళ్ళాడు. త్రిపురలో ఓ 40 ఏళ్ల వ్యక్తి ఈ దారుణం వెనుక ఉన్నారు. పశ్చిమ త్రిపుర జిల్లాలోని అమ్తాలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

కుటుంబ సమస్యల కారణంగా శ్యామల్ దాస్ తన భార్య స్వప్నతో గొడవపడ్డాడు. సోమవారం రాత్రి ఆమెను ఓ వస్తువుతో కొట్టాడు. ఆమె అక్కడికక్కడే మృతి చెందిందని పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ శ్యామల్ పాల్ తెలిపారు.

శ్యామల్ తన ఇంటి లోపల మృతదేహంతో రాత్రంతా గడిపాడు. తర్వాతి రోజు మధ్యాహ్నం 1.20 గంటలకు అతను పోలీస్ స్టేషన్‌కి వెళ్లి తన భార్య తన ఇంట్లో రక్తపు మడుగులో పడి ఉందని చెప్పాడు. పోలీసు బృందం సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుందని సబ్ ఇన్‌స్పెక్టర్ శ్యామల్ పాల్ చెప్పారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి దర్యాప్తు ప్రారంభించారు.

Next Story