సూర్యాపేట జిల్లాలో విషాదం.. ముగ్గురి ప్రాణం తీసిన ఈత స‌ర‌దా

సూర్యాపేట జిల్లాలో విషాద‌కరమైన ఘటన చోటుచేసుకుంది. ఆత్మకూర్(ఎస్) మండలం బొప్పారంలో సరదా కోసం ఈతకు వెళ్లిన ముగ్గురు వ్య‌క్తులు మృత్యువాత పడ్డారు

By Medi Samrat  Published on  17 July 2024 2:24 PM IST
సూర్యాపేట జిల్లాలో విషాదం.. ముగ్గురి ప్రాణం తీసిన ఈత స‌ర‌దా

సూర్యాపేట జిల్లాలో విషాద‌కరమైన ఘటన చోటుచేసుకుంది. ఆత్మకూర్(ఎస్) మండలం బొప్పారంలో సరదా కోసం ఈతకు వెళ్లిన ముగ్గురు వ్య‌క్తులు మృత్యువాత పడ్డారు. మృతుల్లో ఒక బాలిక, ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. హైదరాబాద్ నుంచి బంధువుల ఇంటికి వెళ్లిన‌ ఇద్దరు వ్యక్తులు, ఒక అమ్మాయి కలిసి సరదా కోసం క్రషర్ గుంతల్లో ఈతకు వెళ్లారు. అయితే వర్షాల కారణంగా గుంతలో నీటి ప్రభావం ఎక్కువగా ఉండడంతో నీటిలో మునిగిపోయి మృతి చెందారు. వారు మునిగిపోతుండగా గమనించిన స్థానికులు వెంటనే చెరువులోకి దూకి మృతదేహాలను వెలికి తీశారు. విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు.

మృతులను శ్రీపాల్ రెడ్డి(45) , రాజు ( 44) ఉషా(11 )గా గుర్తించారు. శ్రీపాల్ రెడ్డి అశ్వారావుపేట నుండి బొప్పారం గ్రామానికి స్నేహితునితో కలిసి అత్తగారి ఇంటికి వచ్చి.. మృత్యువాత పడ్డాడు. ముగ్గురు మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుప‌త్రికి తరలించి.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Next Story