రోడ్డు ప్రమాదంలో కొడుకు మృతి.. వార్త విని ఆగిన తండ్రి గుండె

Tragedy In Nalgonda. రోడ్డు ప్రమాదంలో కొడుకు మృతిచెందిన వార్త విన్న తండ్రి గుండె ఆగిపోయింది.

By Medi Samrat
Published on : 11 Oct 2021 8:46 AM IST

రోడ్డు ప్రమాదంలో కొడుకు మృతి.. వార్త విని ఆగిన తండ్రి గుండె

రోడ్డు ప్రమాదంలో కొడుకు మృతిచెందిన వార్త విన్న తండ్రి గుండె ఆగిపోయింది. ఈ విషాదకర ఘటన ఆదివారం రాత్రి నల్లగొండ జిల్లాలో చోటుచేసుకున్నది. స్థానికులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ మండలం తడకమళ్ల గ్రామానికి చెందిన గొర్ల భరత్‌రెడ్డి(30) మాడ్గులపల్లి మండలం బొమ్మకల్‌ గ్రామంలో వ్యవసాయ పనులు ముగించుకొని బైక్‌పై వస్తుండగా.. వేములపల్లి మండలం శెట్టిపాలెం వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందారు. విషయం తెలిసిన భరత్‌రెడ్డి తండ్రి ఇంద్రారెడ్డి (52) గుండెనొప్పితో కుప్పకూలారు. మిర్యాలగూడలోని ప్రైవేట్‌ దవాఖానకు తరలిస్తుండగా కన్నుమూశారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఏరియా ఆసుప‌త్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు.


Next Story