రోడ్డు మీద వెళుతున్న జనం.. ఉరి వేసుకుని కనిపించిన ట్రాఫిక్ పోలీసు

Traffic cop found hanging inside police booth in UP's Hardoi. ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్ జిల్లాలో ఓ ట్రాఫిక్ పోలీసు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

By M.S.R  Published on  12 April 2023 8:06 PM IST
రోడ్డు మీద వెళుతున్న జనం.. ఉరి వేసుకుని కనిపించిన ట్రాఫిక్ పోలీసు

ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్ జిల్లాలో ఓ ట్రాఫిక్ పోలీసు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కొత్వాలి ప్రాంతంలోని సోల్జర్ బోర్డ్ చౌక్‌లోని పోలీస్ బూత్‌లో విధులు నిర్వర్తిస్తున్న ట్రాఫిక్ పోలీసు కానిస్టేబుల్ ఉరి వేసుకుని కనిపించాడు. ఆ రోడ్డు మీదుగా వెళ్తున్న వ్యక్తులు మృతదేహాన్ని గుర్తించడంతో ఈ మరణం విషయం బయటకు వచ్చింది. పోలీసులకు సమాచారం అందించడంతో అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని కిందకు దించారు. ఆ తర్వాత పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్‌ను హర్దోయ్‌ కు చెందిన అశోక్ కుమార్‌గా గుర్తించారు. అతని శరీరంపై ఎలాంటి గాయాలు కనిపించలేదు. మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని, దర్యాప్తు కొనసాగుతోందని పోలీసు సూపరింటెండెంట్ రాజేష్ ద్వివేది తెలిపారు. అతడు ఒంటరిగా నివసిస్తూ ఉన్నాడని తెలిపారు.


Next Story