లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన 'బుల్లెట్ బండి' పెళ్లి కొడుకు

Town planning supervisor caught by ACB.గతేడాది ఓ న‌వ వ‌ధువు త‌న భ‌ర్త‌పై ఉన్న‌ప్రేమ‌ను చూపిస్తూ బుల్లెట్ బండి సాంగ్‌కు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 Sept 2022 8:23 AM IST
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన బుల్లెట్ బండి పెళ్లి కొడుకు

గతేడాది ఓ న‌వ వ‌ధువు త‌న భ‌ర్త‌పై ఉన్న‌ప్రేమ‌ను చూపిస్తూ బుల్లెట్ బండి సాంగ్‌కు డ్యాన్స్ చేయ‌గా అది వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే. ఓవ‌ర్ నైట్‌లో ఆ జంట సెల‌బ్రెటీలుగా మారిపోయారు. తాజాగా ఆ పెళ్లి కొడుకు మ‌రోసారి వార్త‌ల్లోకి ఎక్కాడు. అప్పుడు పాట‌తో పాపుల‌ర్ అయితే.. ఇప్పుడు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా బుక్క‌య్యాడు.

బ‌డంగ్‌పేట మున్సిప‌ల్ కార్పొరేష‌న్ టౌన్ ప్లానింగ్ అధికారిగా ఆకుల ఆశోక్ ప‌ని చేస్తున్నాడు. ఇంటి నిర్మాణం విష‌యంలో త‌న వ‌ద్ద‌కు వ‌చ్చిన దేవేంద‌ర్ రెడ్డి అనే వ్య‌క్తి నుంచి రూ.30వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో దేవేంద‌ర్ రెడ్డి అవినీతి నిరోధ‌క శాఖ‌(ఏసీబీ) అధికారుల‌ను ఆశ్ర‌యించాడు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు అశోక్ లంచం తీసుకుంటుండ‌గా రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకున్నారు. మున్సిప‌ల్ కార్పొరేష‌న్ కార్యాల‌యంలో పాటు నాగోల్ లోని రాక్ టౌన్ కాలనీలోని అశోక్ ఇంటిలోనూ ఏసీబీ అధికారులు సోదాలు చేశారు.

బుల్లెట్ బండి పాట‌కు డ్యాన్స్ చేసి సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారిన పెళ్లి కుమారై భ‌ర్తే ఈ అశోక్‌.

Next Story