తలపై రూ. కోటి రివార్డ్‌.. ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు టాప్ లీడ‌ర్‌ మృతి

ఒడిశాలో జరిగిన ఉమ్మడి నక్సల్ వ్యతిరేక ఆపరేషన్‌లో రూ.1.1 కోట్ల బౌంటీ ఉన్న అగ్ర మావోయిస్టు కమాండర్ మృతి చెందాడని అధికారులు తెలిపారు.

By -  Medi Samrat
Published on : 25 Dec 2025 4:36 PM IST

తలపై రూ. కోటి రివార్డ్‌.. ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు టాప్ లీడ‌ర్‌ మృతి

ఒడిశాలో జరిగిన ఉమ్మడి నక్సల్ వ్యతిరేక ఆపరేషన్‌లో రూ.1.1 కోట్ల బౌంటీ ఉన్న అగ్ర మావోయిస్టు కమాండర్ మృతి చెందాడని అధికారులు తెలిపారు. నిషేధిత తిరుగుబాటు సంస్థకు ఇది పెద్ద దెబ్బ అని ప్రభుత్వం అభివర్ణించింది. సిపిఐ (మావోయిస్ట్) కేంద్ర కమిటీ సభ్యుడు, ఒడిశాలో ఆ సంస్థ చీఫ్ గణేష్ ఉయ్కే, గంజాం మరియు కంధమాల్ జిల్లాల సరిహద్దులోని రాంపా అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారు. ఒడిశా స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌తో కలిసి ఈ ఆపరేషన్ నిర్వహించాయి.

కందమాల్ జిల్లాలో జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతిచెందారు. మృతుల్లో ఒక మహిళ కూడా ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఘటనా స్థలం నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన బలగాలు ఒక రివాల్వర్, పాయింట్ 303 రైఫిల్, ఒక వాకీ-టాకీ సెట్‌ను స్వాధీనం చేసుకున్నాయి. ప్రస్తుతం ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.

Next Story