మదనపల్లిలో టమాటా రైతు హ‌త్య

Tomato Farmer Was Killed By Unidentified Persons In Madanapalle. ఓ టమాటా రైతు హత్యకు గురవ్వడం ఏపీలో కలకలం రేపింది. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో టమాటా రైతు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  13 July 2023 6:38 PM IST
మదనపల్లిలో టమాటా రైతు హ‌త్య

ఓ టమాటా రైతు హత్యకు గురవ్వడం ఏపీలో కలకలం రేపింది. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో టమాటా రైతు దారుణను గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. బోడి మల్లెదిన్నెకు చెందిన నారెం రాజశేఖర్ రెడ్డి కూరగాయల వ్యాపారం చేస్తుంటారు. మంగళవారం ఆయన మార్కెట్‌కు పెద్ద ఎత్తున టమాటాలను తీసుకుని వెళ్లి అమ్మాడు. టమాటాలను విక్రయించగా అతనికి భారీగానే డబ్బులు వచ్చాయి. అతను ఇంటికెళ్లేలోగా హత్యకు గురయ్యాడు. టమాటాలు అమ్మిన సొమ్మును దొచుకోవడానికి రాజశేఖర్ రెడ్డి హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు.

అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. కేసును ఛేదించేందుకు నాలుగు బృందాలను ఏర్పాటు చేసినట్లు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) కేశప్ప తెలిపారు. విచారణలో భాగంగా పోలీసులు స్నిఫర్ డాగ్‌ను రంగంలోకి దించారు. 3-4 మంది కలిసి హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసు సూపరింటెండెంట్ గంగాధరరావు సంఘటనా స్థలాన్ని సందర్శించి బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. రైతుకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుమార్తెలిద్దరికీ వివాహమై బెంగళూరులో ఉంటున్నారు.


Next Story